ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘ OG ‘ టైటిల్ ఏ స్మాల్ చేంజ్‌… కొత్త టైటిల్ ఇదే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ త్వరలోనే మరికొన్ని సినిమాలతో సందడి చేయడానికి రెడీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రస్తుతం సినిమాల్లో ఓజి కూడా ఒకటి. యంగ్ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ భారీ యాక్షన్ సినిమాకు సంబంధించిన సగభాగం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా మొదటి నుంచి ఎంతో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఈ సినిమాకి మేకర్స్ పలు పవర్ఫుల్ ట్యాగ్లు కూడా స్టార్టింగ్ లోనే రివిల్ చేశారు. “ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్”, “దే కాల్ హిమ్ ఓజి” అంటూ ట్యాగ్స్ రివీల్ చేయగా ఇవి కూడా అదిరే రేంజ్ లో హైలైట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాటిలో ది కాల్ హిమ్ ఓజి అనే టైటిల్ని ఈ సినిమాకిి టైటిల్ గా కన్ఫామ్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.