Wart Removal : ఒంటినిండా పులిపిరిలు ఉంటే.. వాటిని ఇలా తొలగించండి..!

ఈమధ్య చాలా మందికి ఎక్కడ పడితే అక్కడ పులిపిర్లు వస్తున్నాయి. చర్మ సంబందిత సమస్యల వల్ల పులిపిర్లు (Wart Removal ) కూడా ఒకటి. అయితే వీటి వల్ల అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ కనిపించే చోట ఉంటే చూడటానికి ఇబ్బందిగా ఉంటాయి. వీటి వల్ల నొప్పి కానీ.. ఎలాంటి బాధ ఉండదు. ముఖం, మెడ, చేతులు, కాళ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ పులిపిర్లు వస్తున్నాయి.

పులిపిర్లు తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వీటి కోసం కొన్ని కాస్మొటిక్స్ కూడా వాడుతుంటారు. అయితే అవి అంతగా ప్రభావం చూపించవు. పులిపిర్లు (Wart Removal ) తొలగించడం కోసం ఆయుర్వేదంలో చాలా సులువైన మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఉండే వాటితోనే పులిపిర్లు తొలగించుకునే అవకాశం ఉంది. ఇంతకీ పులిపిర్లు తొలగించాలంటే ఏం చేయాలంటే.

గిన్నెలో ఒక అర టీ స్పూన్ తెల్లని తూట్ పేస్ట్ తీసుకుని.. అందులో ఒక టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ వంట సోడాని మిక్స్ చేయాలి. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పులిపిర్ల మీద రాసుకుని పడుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల కొద్దిరోజులకి పులిపిర్లు తొలగిపోతాయి.

పులిపిర్లు తొలగించేందుకు మరో చిట్కా ఏంటి అంటే.. తమలపాకులో తడి సున్నం కలిపి రాసుకున్నా సరే పులిపుర్లను తొలగించవచ్చు. తాజావైన తమలపాకును కాడతో సహా తీసుకుని.. దాని కాడను ఆకు నుండి వేరు చేసి. ఆ కాడతో తడి సున్నాన్ని తీసుకుని పులిపిర్ల మీద 3 నిమిషాల పాటు మర్ధనా చేయాలి. ఇలా రోజు చేస్తే కూడా పులిపిర్లు వాటంతట అవే తొలగిపోతాయి.

 

Tags: Health Updates, Home Remedies, Skin Problems, Wart, Wart Removal