టిక్ టాక్ ద్వారా పాపులర్ అయ్యి ఈటీవీ ఢీ షోకి యాంకర్ గా ఛాన్స్ అందుకుంది దీపికా పిల్లి (Deepika Pilli). ఈటీవీ నుంచి స్టార్ మా కి షిఫ్ట్ అయిన అమ్మడు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక వాంటెడ్ పండుగాడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద తన లక్ టెస్ట్ చేసుకుంటుంది. సినిమాలు, షోలతో పాటుగా తన సోషల్ మీడియాలో కూడా అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రతి చిన్న అప్డేట్ ని ఫాలోవర్స్ తో పంచుకునే దీపిక పిల్లి తన ఇన్ స్టాగ్రాం స్టేటస్ లో నాలుక కొరుక్కున్నప్పుడు ఏం తిన్నా సరే నొప్పి భరించలేనంతగా ఉంటుందని అంటుంది.
నాలుక కొరుక్కుంటే ఎవరికైనా నొప్పిలేస్తుంది. అయితే దీపిక పిల్లి చెప్పడంతో నెటిజెన్లు ఏం పాప నాలుక కొరుక్కున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాంటెడ్ పండుగాడ్ సినిమాలో సుడిగాలి సుధీర్ కి జోడీగా నటించింది దీపిక పిల్లి. ఈ సినిమాలో అమ్మడు రెచ్చిపోయి మరి అందాలకు పని చెప్పినట్టు తెలుస్తుంది.
స్మాల్ స్క్రీన్ మీద వచ్చిన క్రేజ్ ని సిల్వర్ స్క్రీన్ మీద వాడుకోవాలని చూస్తుంది అమ్మడు. మరి దీపిక (Deepika Pilli) ఫస్ట్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. దీపిక మాత్రం గ్లామర్ షోలో కూడా నో లిమిట్స్ అనేస్తుందని తెలుస్తుంది.