టాలీవుడ్ యంగ్ హీరోలో ఒక్కడైనా విశ్వక్ సేన్ వరసగా సినిమాలు చేస్తున్నాడు.విశ్వక్ సేన్ చివరిగా నటించిన ‘ఓరి దేవుడా’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక గాసిప్ కారణంతో మళ్లీ వార్తల్లో నిలిచాడు.
ఆ గాసిప్ ఏమిటంటే విశ్వక్ సేన్ యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న తన కొత్త చిత్రం నుండి తప్పుకున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది . విశ్వక్ ఇలా వెళ్లడానికి కారణం తెలియదు కానీ ఈ వార్త వైరల్‌గా మారింది.
అర్జున్ ఈ చర్యతో కలత చెందాడని ,ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు అని టాక్ . ఈ చిత్రంలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటిస్తోంది.