ప్రభాస్ ‘ఆదిపురుష్’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పటి నుండి VFX షాట్‌లు, ప్రభాస్ లుక్స్ పై ఇతరుల నుండి తీవ్రమైన విమర్శలను ఎదుకుంటున్నారు. ఈ కామెంట్స్ వల్ల స్టార్ ప్రభాస్ కూడా అసంతృప్తిగా ఉన్నారు.

ఈ సినిమాని జూన్ 16, 2023కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించారు. “వీక్షకులకు పూర్తి దృశ్యమాన అనుభూతిని అందించడానికి, మేము మా బృందాలకు మరింత సమయం ఇవ్వాలి.వారు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. భారతదేశం గర్వించదగ్గ సినిమా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. మీ మద్దతు, ప్రేమ మరియు దీవెనలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌పై ఆదిపురుష్ టీమ్ రీవర్క్ చేస్తుంది మరియు మళ్లీ VFX కోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి.

ఈ పౌరాణిక డ్రామా చిత్రంలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది, ఇందులో సైఫ్ అలీ ఖాన్ మరియు సన్నీ సింగ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. T-Series మరియు Retrophiles Pvt Ltd సంయుక్తంగా ఈసినిమాని నిర్మించాయి, అన్ని ఇండియన్ అన్ని భాషలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది.

Tags: adipurush movie release date, bollywood news, director Om Raut, Kriti Sanon, Prabhas, Saif Ali, Saif Ali Khan, tollywood news