కోరిక తీరుస్తే సినిమా ఛాన్స్ ఇస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణుప్రియ..

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు విష్ణుప్రియ..రియాలిటీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న ఆమె అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది విష్ణుప్రియ.. నెట్టింట్ట ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన పాలోవర్స్ మతిపోగొడుతోంది.. ఇటీవల ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ‘జరీ జరీ’ అనే అల్బమ్ సాంగ్ తో అలరించింది.. ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ గా మారింది.

ఈక్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే కమిట్మెంట్ అవ్వాల్సిందే అంటూ కొందరు నటీమణులు బహిరంగంగానే ప్రకటించారు. ఈక్రమంలో యాంకర్ విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి..

విష్ణుప్రియ ఏమన్నారంటే.. ‘ఇండస్ట్రీలో కచ్చితంగా కాస్టింగ్ కౌచ్ ఉంది. ఒక్క ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోటా ఉంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారు. ఒప్పుకుంటే సినిమా అవకాశఆలు వస్తాయి.. లేదంటే రావు..ఆఫర్స్ కోసం చూస్తున్న సమయంలో నన్ను కూడా చాలా మంది కోరిక తీర్చాలని అడిగారు. దానికి నేను ఒప్పుకోలేదు. అందుకే ఎన్నో ఆఫర్లు వదులుకున్నా. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. హార్మోన్లు కంట్రోల్ లో ఉంచుకోవాలి’ అని విష్ణుప్రియ కామెంట్స్ చేసింది. ఇక ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ గురించి మాట్లాడుతూ..‘అవును ఇండస్ట్రీలో పురుషాధిక్యం ఎక్కువ ఉంది. ఇది పోవడానికి ఇంకా సమయం పడుతుంది. మహిళలు ఆయా రంగాల్లో రాణించాలంటే టైమ్ పడుతుంది. 15-20 ఏళ్లలో ఆడవాళ్లు కూడా మగాళ్లకు పోటీగా వస్తారు’ అంటూ విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది.. అంతేకాదు తనకు ఇక యాంకర్ అనే ట్యాగ్ వద్దని, అలా పిలిపించుకోవడం ఇష్టం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Tags: comments, goes viral, latest news, Songs, Vishnu Priya