ఈ బ్యూటీ ఒక్కరోజుకు అంత ఖర్చు చేయిస్తుందా..?

‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. తన అందంతో అందరని మెస్మరైజ్ చేసింది ఈ కన్నడ బ్యూటీ. మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ సంసాదించుకుంది. కమర్షియల్ చిత్రాలకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ఈ బ్యూటీ చేతిలో ఇప్పటికే మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్క హిట్ పడితే చాలా ఈ బ్యూటీ తెలుగులో టాప్ ప్టేస్ లోకి దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈక్రమంలో ఆమె గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ నెట్టింట్ట చక్కర్లు కొడుతోంది..

శ్రీలీలకు స్టార్ స్టేటస్ రాకముందే విలాసవంతమైన జీవితం అలవాటైందట.. టాలీవుడ్ లో శ్రీలీలకు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుందని, షూటింగ్ సమాయంలో నిర్మాతలతో భారీ ఖర్చు చేయిస్తుందని టాక్. ప్రస్తుతం శ్రీలీల మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హదరాబాద్ లో జరుగుతోంది..

ఈ సినిమా కోసం శ్రీలీల పెట్టిస్తున్న ఖర్చులకు నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారట.. శ్రీలీల తన తల్లితో కలిసి ఒక నెలరోజుల పాటు హోటల్లోనే ఉండోబోతున్నారట. దీని కోసం నిర్మాతలతో ఆమె నెల రోజులకు సెవెన్ స్టార్ హోటల్ ను బుక్ చేయించిందట.. ఈ హోటల్ లో బస చేసేందుకు నిర్మాతలు రోజుకు రూ.20 వేలకు పైగా చెల్లిస్తున్నారట.. ఈనెల రోజుల పాటు షూటింగ్ పూర్తయ్యే నాటికి హోటల్ లో బస చేసేందుకు శ్రీలీల కోసం నిర్మాతలు రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టుబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. శ్రీలీల ఒక్క షెడ్యూల్ కోసం భారీ మొత్తంలో ఖర్చు అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags: latest news, news viral, pelli sandhi, Sri Lela, viral latest