టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక పాదయాత్ర యువగళం. అనేక అంచలు దాటుకుని.. నిర్విఘ్నంగా.. అశేష జనాదరణతో ముందుకు సాగుతున్న ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా.. పాదయా త్ర అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలోనూ.. నారా లోకేష్‌కు ప్రజల నుంచి ఆదరణ కనీ వినీ ఎరుగని విధంగా లభిస్తోంది. ప్రస్తుతం ఈ యాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో పూర్తి చేసుకుంది.
ఇతర నియోజకవర్గాల్లోనూ ఈ యాత్ర భారీ హిట్ సాధించినా.. ఈ నియోజకవర్గం విషయానికి వస్తే.. మా త్రం మరింత సూపర్‌హిట్ సాధించింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. నారా లోకేష్‌కు జేజేలు కొట్టారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సారథ్యంలో భారీ సంఖ్యలో యువత వచ్చి.. నారాలోకేష్‌కు గజమాలలతో స్వాగతం పలికిన దగ్గర నుంచి పాదయాత్ర పూర్తయ్యే వరకు వినుకొండ రికార్డు సృష్టించిందనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఇక్కడ ముగిసిన పాదయాత్రను చూసిన తర్వాత.. టీడీపీలో మరింతగా అంచనాలు పెరిగాయి. మాజీ ఎమ్మెల్యే , టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు విజయం నల్లేరుపై నడకేనని అనేవారు కొందరైతే.. ఈసారి ఆయన మెజారిటీ 30 – 35 వేల పైచిలుకు దాటుతుందని చెప్పేవారే ఎక్కువగా కనిపిస్తు న్నారు. ఇటీవల స్థానిక మీడియా ఒకటి.. పాదయాత్రలో పాల్గొన్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించిం ది. దీని ప్రకారం.. జీవీకి.. ఈ నాలుగేళ్లలో మరింత ప్రజాదరణ పెరిగిందని తెలుస్తోంది.
2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జీవీ ఆంజనేయులు.. విజయం దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయనకు ఒకసారి 24 వేల మెజారిటీ, తర్వాత 21 వేల మెజారిటీ లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఏకంగా 30 – 35 వేల పై చిలుకు మెజారిటీ ఖాయమనే టాక్ జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. సమస్యలపై స్పందించడం.. ప్రజల్లోనే ఉండడం.. వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయడం.. వంటివి జీవీకి కలిసి వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.