నమ్రతతో అలా ఎంజాయ్ చేస్తోన్న ఫొటో షేర్ చేసిన మ‌హేష్‌…!

టాలీవుడ్ లో ద క్యూటెస్ట్ బ్యూటిఫుల్ పేయిర్‌ అనగానే ఠ‌క్కున‌ గుర్తుకు వచ్చే వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత‌ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో న‌టిస్తోన్న టైంలో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటార‌న్న‌ విష‌యం తెలుసు. అలాగే వారి పిల్లలపై చూపించే కేర్ కానీ వారి కుటుంబం మొత్తం కలిసి గడిపే వెకేషన్స్ కానీ స్పెండ్ చేసే సమయం కానీ ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.

ఈ ఫోటోలతో వారి అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ వీళ్లు. ప్ర‌స్తుతం ఈ జంట ఓ స్మాల్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ బాబు తన భార్యతో కలిసి ఈ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

భారీ ఫైర్ వర్క్స్ ని ఇద్దరు కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న పిక్‌ని మహేష్ బాబు తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుని తన ప్రేమను వివరించాడు. ఈ బాణాసంచా వెలుగులో వీరిద్దరూ ఎంతో క్యూట్ గా కనిపించారు. దీంతో ఆ బ్యూటిఫుల్ స్నాప్ మరింత అందంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.