పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా…. ఈ బుడ్డోడి పేరు ఇదే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా తనను అభిమానించే అభిమానులకు షాపు ఇచ్చే ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పేసింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇలియానా వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పిన ఇలియానా తన కొడుకు ఫోటోను షేర్ చేయడంతో పాటు తన కొడుకు పేరును సైతం అభిమానులకి చెప్పడం ఆశ్చర్యం. ఈమె చెప్పిన శుభవార్త తన అభిమానులతో పంచుకుంది. ఆగస్టు 1న తన మొగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపింది.

తన కొడుకుకు ‘ కోవా ఫీనిక్స్ డోలన్ ‘ అని పేరు పెట్టాలని ఆమె అన్నారు. నా కొడుకును ప్రపంచానికి పరిచయం చేస్తుంటే కలుగుతున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ ఇలియానా తెలిపింది. ఈ విషయం తెలిసిన అభిమానులు తన కొడుకు అచ్చం తల్లి పోలికలే ఉన్నాయని అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కొడుకుకు జన్మనిచ్చిన ఇలియానా తన పెళ్లి గురించి కొడుకు, ఇతర విషయాల గురించి మాత్రం చెప్పలేదు.

గత నెలలో ప్రియుడి ఫోటోలను పంచుకున్న ఇలియానా తన గురించి ఎటువంటి విషయాలను తెలియజేయలేదు. త్వరలో ఇలియానా తనకు సంబంధించిన శుభవార్తలు, వ్యక్తిగత విషయాలు తెలియజేస్తారని తమ అభిమానులు అనుకుంటున్నారు. మళ్లీ తెలుగులో హీరోయిన్ గా బిజీ అవ్వాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుని సంచలనం సృష్టించింది.