Neha : విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా మాస్ మహరాజ్ రవితేజ కెరియర్ లో స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. రవితేజ డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమాలో రవితేజ కూతురు పాత్రలో ఒక చిన్న పాప నటించింది. ఆమె పేరు తోట నేహ. సినిమా ఆడిషన్ టైం లో వచ్చిన పిల్లలంతా అల్లరి చేస్తుంటే నేహా మాత్రం సైలెంట్ గా కూర్చున్నదట. రాజమౌళి తన సినిమాలో ఇలానే ఉండాలని నేహాని సెలెక్ట్ చేశారట.

అయితే విక్రమార్కుడు సినిమా టైం లో నేహా ( Neha) చిన్న పిల్ల కానీ ఇప్పుడు ఆమె ఎం.బి.ఏ పూర్తి చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నేహా ఆ తర్వాత స్టడీస్ మీద దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు ఆమె లేటెస్ట్ పిక్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నేహా ఉంది.

Neha కూడా ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అనుభవం ఉంది కాబట్టి హీరోయిన్ గా రాణించాలని చూస్తుంది. మరి అమ్మడికి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. 2006 లో వచ్చిన విక్రమార్కుడు మూవీ టైం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న నేహా 16 ఏళ్ల తర్వాత హీరోయిన్ గా ఎంట్రీకి రెడీ అవుతుంది.

Tags: Child Artist Neha Totha, Neha, rajamouli, RaviTeja, Tollywood, Vikramarkudu