Vikram : అయ్యో.. ఆ స్టార్ హీరోకి ఇంత దారుణమైన బిజినెస్..!

చియాన్ విక్రం (Vikram) హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరక్షన్ లో వస్తున్న సినిమా కోబ్రా. ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో కె.జి.ఎఫ్ నటి శ్రీనిధి శెట్టి, మృణాలిని రవి హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో మ్యాథ్స్ సైంటిస్ట్ గా విక్రం కనిపించనున్నారు. ఈ సినిమాలో విక్రం రకరకాల గెటప్పులతో అదరగొట్టనున్నాడు. విక్రం సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు.

అప్పట్లో విక్రం (Vikram) నటించిన అపరిచితుడు సినిమా తెలుగులో కూడా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత తన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్నా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. కోబ్రా సినిమా తెలుగులో ఏమాత్రం సందడి చేయట్లేదని చెప్పొచ్చు. అంతేకాదు తెలుగు వర్షన్ బిజినెస్ కూడా చాలా తక్కువ అయ్యిందని టాక్. సినిమాని తెలుగు వర్షన్ కి 5 కోట్ల లోపే బిజినెస్ జరిగిందని అంటున్నారు.

విక్రం కి తెలుగులో మార్కెట్ దాదాపు పోయింది. కోబ్రా సినిమా హిట్ అయితే మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా విక్రం నటిస్తున్నాడు.

Tags: Cobra Movie, Cobra Telugu Business, Tollywood, vikram, Vikram Cobra