Vijay Devarakonda : ఘోరంగా పడిపోయిన లైగర్ కలక్షన్స్.. సెకండ్ డే ఎంతంటే..!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లైగర్ ఫస్ట్ డే టాక్ తో సంబంధం లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ ల పుణ్యమాని 9 కోట్లతో దుమ్ముదులిపేసింది. హిందీ ఓవర్సీస్ తో కలుపుకుని 16 కోట్ల దాకా షేర్ రాబట్టాడు విజయ్. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 9.5 కోట్లతో సత్తా చాటాడు రౌడీ హీరో. అయితే సెకండ్ డే కలక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజు కేవలం కోటిన్నర మాత్రమే కలెక్ట్ చేసింది.

ఈ సినిమా పోయింది అని చెప్పడానికి ఈ కలక్షన్స్ సాక్ష్యమని చెప్పొచ్చు. లైగర్ సినిమాతో విజయ్ (Vijay Devarakonda) హిందీ మార్కెట్ లో కూడా దిగాడు. ఫస్ట్ రోజు అక్కడ 5 కోట్ల పైన షేర్ తీసుకు రాగా సెకండ్ డే అక్కడ కూడా కలక్షన్స్ డ్రాప్ అయ్యాయి. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో విజయ్ నటించిన లైగర్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేదు. అందుకే సినిమా రెండో రోజుకే కలక్షన్స్ తేడా కొట్టాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో 55 కోట్లు వరల్డ్ వైడ్ 90 కోట్ల బిజినెస్ చేసిన లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలు ఎదుర్కునే ఛాన్స్ ఉంది.

Tags: ananya pandey, liger, Liger Collections, puri jagannath, Tollywood, Vijay Devarakonda