టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికే థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. మహేష్‌బాబు హైదరాబాద్‌కే తలమానికం అయిన ఏఎంబీ మాల్ నిర్మాణ భాగస్వామి. అలాగే విజయ్ దేవరకొండ తన సొంత ఊరు మహబూబ్‌నగర్‌లో విజయ్ దేవరకొండ ఏవీడీ మాల్ భాగస్వామి అయ్యారు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
హైదరాబాద్‌లోని బన్నీ కొత్త మల్టీఫ్లెక్స్ ఓపెన్ కానుంది. ఒకప్పటి అమీర్ పేట సత్యం థియేటర్ ఇప్పుడు మాల్ గా, మల్టీ ఫ్లెక్స్‌గా సరికొత్తగా మారింది. ఆసియన్ మాల్‌గా మారిన ఈ మాల్‌లో టాప్ ఫ్లోర్‌లో థియేటర్లు ఉండనున్నాయి. ఈ మాల్‌లో మొత్తం ఐదు స్క్రీన్లు ఉండనున్నాయి. ఈ నెల 16 నుంచి ప్రభాష్ ఆదిపురుష్ సినిమాతో ఈ మాల్ ఓపెన్ కానుంది.
14న పూజా కార్యక్రమాలు, 15న అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ప్రారంభించడం, 16 నుంచి ఆదిపురుష్ సినిమా ప్రదర్శన ఉంటుంది. తొలిరోజు మొత్తం ఐదు స్క్రీన్లలోనే ఆదిపురుష్ సినిమాయే ప్రదర్శిస్తారని తెలుస్తోంది. అయితే సత్యం థియేటర్ చాలా కీలక ప్రదేశంలో ఉండేది. యావరేజ్, ప్లాప్ సినిమాలు పడినా కూడా ఈ థియేటర్ ఎప్పుడూ హౌస్‌ఫుల్ బోర్డులతోనే దర్శనమిచ్చేది.
ఈ ఏరియాలో విపరీతమైన సినీ లవర్స్ ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉండే ఏరియా ఇది. ఇక్కడ మంచి థియేటర్లు లేక ఇక్కడ జనాలు అందరూ పంజాగుట్ట, ఇటు బంజారాహిల్స్, అటు యర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి థియేటర్ల వైపు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఐదు స్క్రీన్ల మల్టీఫ్లెక్స్ రావడంతో పైన చెప్పుకున్న ఏరియాల్లో ఉన్న మల్టీఫ్లెక్స్‌లకు, థియేటర్లకు కాస్త జనాలు, సినీ లవర్స్ సందడి ఖచ్చితంగా తగ్గనుంది.