షూటింగ్ స్పాట్లోనే అల్లు రామలింగయ్యపై అరిచేసిన విజ‌య‌నిర్మ‌ల‌… ఆయ‌న చేసిన త‌ప్పు ఇదే…!

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య బహుముఖ‌ ప్రజ్ఞశాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు ఉన్న అగ్ర తారలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐకాన్ సార్ అల్లు అర్జున్‌తో కూడా నటించిన రామలింగయ్య చివరి రోజుల్లో కూడా సినిమాల్లో నటించారు. కొన్ని వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన రామలింగయ్య .. ఒకానొక సమయంలో విజయనిర్మల చేతిలో ఘోరంగా అవమానించ‌బ‌డ్డారట‌.

Vijaya Nirmala - Wikipedia

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విజయనిర్మల దర్శకురాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ డైరెక్టర్‌ విజయనిర్మల గిన్నిస్ బుక్‌లోనూ స్థానాన్ని సంపాదించుకుంది. సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలకు పని చేసిన విజయనిర్మల ఆయ‌న‌తో ప్రేమలో పడి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయనిర్మలను షూటింగ్ టైంలో ఎవరితో అయినా ఇబ్బంది పడాల్సి వచ్చిందా ? అని అడిగిన ప్రశ్నకు కొంతమందితో ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పకొచ్చారు.

Allu Ramalingaiah award is special: Kota Srinivasa Rao | India Forums

కోట శ్రీనివాస్ గారు ఒక సమయంలో ఇబ్బంది పెట్టారని.. అలాగే అల్లు రామలింగయ్య గారి వల్ల కూడా నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పింది. రామ‌లింగ‌య్య గారు ఒక రోజు షూటింగ్‌కి బాగా తాగి వచ్చి ఇబ్బంది పెట్టారని నేను సీన్ పేపర్స్ ఇచ్చి సీరియస్ గా సీన్ ఎక్స్ ప్లేయిన్ చేస్తున్న టైంలో తాగిన మైకంలో నవ్వుతూ ఏమీ అర్థం కానట్టు రామ‌లింగ‌య్య బిహేవ్ చేశార‌ని.. దాంతో కోపం వచ్చిన నేను రామలింగయ్య గారు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరిచాన‌ని చెప్పారు

ఈ రోజు నేను మీతో సీన్స్ చేయలేను అంటూ షూటింగ్స్ స్పాట్ నుంచి ఆయన్ని పంపించేశాను అంటూ చెప్పుకొచ్చింది. దాని అవ‌మానంగా ఫిలైన రామలింగయ్య గారు అప్పటినుంచి ఏ షూటింగ్ కు తాగి వెళ్లలేదట. ఈ విష‌యాన్ని విజ‌య‌నిర్మ‌ల స్వ‌యంగా చెప్ప‌డంతో ఈ నిజం బ‌య‌ట ప‌డింది