టాలీవుడ్‌లో తమ ఫ్యామిలీతో కలిసి నటించిన హీరోలు వీళ్లే…!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల‌ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో హీరోతో నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడు అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సీనియార్ స్టార్ హీరోలైన‌ వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీ హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు. ఇటు నాగార్జున ,నాగ చైతన్య కలిసి ‘బంగార్రాజుగా మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఇక బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌తో కలిసి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ’ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో తండ్రి కొడుకులుగా కలిసి నటించారు.

ఆచార్య సినిమాతో తండ్రి కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ తొలి సారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అంతకు ముందు వీళ్లిద్దరు మగధీర, బ్రూస్‌లీ సినిమాల్లో కాసేపు నటించి మెగాభిమానులను అలరించారు. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమాలో వెంకటేష్, నాగచైతన్య వాళ్ల రియల్ లైఫ్‌లో లాగే మామ అల్లుళ్లుగా నటించడం విశేషం.

అంతకు ముందు ‘ప్రేమమ్’ సినిమాలో వీళ్లిద్దరు ఇలాగే నిజ జీవిత పాత్రలైన మామా అల్లుళ్లుగా నటించడం విశేషం.ఇక ‘ప్రేమమ్’ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య తండ్రి కొడుకులుగా వాళ్ల నిజ జీవిత పాత్రలనే తెరపై చేయడం విశేషం. నాగచైతన్య తన మాజీ భార్య సమంతతో కలిసి మజిలీ సినిమాలో నటించాడు. పెళ్ళి అయ్యాక తొలిసారిగా వీళ్ళు కలిసి నటించిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

pawan kalyan movies, 'ట్రెండ్‌ని ఫాలో కాను.. సెట్ చేస్తా'.. 'అక్కడ'  మొదలెట్టిన వకీల్ సాబ్ @26 జర్నీ - tollywood trendsetter power star pawan  kalyan birthday special; akkada ammayi ikkada abbayi to ...

నాగార్జున కూడా తన భార్య అమలతో పలు సినిమాల్లో నటించారు. నాగార్జున తన తండ్రి నాగేశ్వరావుతో కూడా కలిసి పలు సినిమాలలో నటించారు. వారు నటించిన సినిమాల్లో కూడా నిజ జీవితంలో తండ్రి కొడుకులు లాగానే నటించారు. అక్కినేని ఫ్యామిలీలో మరో విషషం ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ కలిసి మనం సినిమాలో నటించారు.

నందమూరి హీరోల విషయానికొస్తే నటరత్న ఎన్టీఆర్ నట వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ తాతమ్మక‌ల‌ సినిమాతో తండ్రి కొడుకుల నిజ జీవిత పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బాలయ్య కలిసి అక్బర్ సలీం అనార్కలి, ‘శ్రీమద్విరాట పర్వం సినిమాల్లో కూడా తండ్రి కొడుకులు గా నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ ఎన్టీఆర్‌తో పలు సినిమాల్లో నటించారు. బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో కొడుకు కళ్యాణ్ రామ్ తో కలిసి బాలకృష్ణ తండ్రి కొడుకులుగా నటించారు. ఇక ఎప్పుడు తారక్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఈ ముగ్గురు కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు.

Rana Naidu Review: Daddy issues haunt Venkatesh, Rana Daagubati's series.  Bad sex, lazy writing kill the story - India Today

సూపర్ స్టార్ కృష్ణ తన నటవరసులుగా మహేష్ బాబు, రమేష్ బాబును చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కొడుకులతో కలిసి పలు సినిమాల్లో నటించారు. మహేష్ బాబు తన అన్న దివంగత రమేష్ బాబుతో కూడా తన కెరీర్ బిగినింగ్ లో కలిసి అన్నదమ్ములుగా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయనిర్మలతో కూడా సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత కూడా కృష్ణ విజయనిర్మలతో ఎన్నో సినిమాల్లో కూడా నటించాడు. ఇక ఆమె దర్శకత్వంలో కూడా కృష్ణ పలు సినిమాలు చేశాడు.

దివంగత కృష్ణంరాజు ,ప్రభాస్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ఈ పెద్దనాన్న కొడుకులు కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో నటించినా.. నిజ జీవిత పాత్రల్లో మాత్రం నటించలేదు. గతేడాది వీళ్లిద్దరు ‘రాధే శ్యామ్’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మోహన్ బాబు తన తనయులతో కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ చిత్రంలో కలిసి కనువిందు చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మీ కీలక పాత్రలో నటించడం విశేషం.

Krishnam Raju's Movies With Prabhas – Rebel Stars Acted Together In These  Movies | Telugu Filmnagar

చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ విషయానికొస్తే.. చిరంజీవి, నాగబాబు కొన్ని సినిమాల్లో కలిసి నటించినా.. నిజ జీవిత పాత్రలైన అన్నాదమ్ములుగా మాత్రం నటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అందులో కూడా వీళ్లు రక్త సంబంధం ఉన్న పాత్రలో మాత్రం నటించలేదు. చిరంజీవి నటించిన ‘విజేత’ లో చిన్నప్పటి పాత్ర చేసిన అల్లు అర్జున్.. ఆ తర్వాత ‘డాడీ’లో ఓ పాత్రలో నటించారు. ఆ తర్వాత చిరు హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్‌’లో ఓ పాటలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇక నిజ జీవితంలో బాబాయి అబ్బాయిలైన వెంకటేష్, రానా ఇద్దరు కలిసి ఓ సినిమలో పూర్తి స్థాయిలో కలిసి నటించకపోయినా.. రానా నాయుడు అనే వెబ్‌ సిరీస్‌‌లో కలిసి నటించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pandavulu Pandavulu Thummeda (2014)