విజయ్ సేతుపతి క్రేజ్.. బాలీవుడ్ లోనూ పాగా వేస్తారా?

కోలివుడ్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరోగానే కాదు.. క్యార్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భాష ఏదైనా, పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే నటుడు విజయ్ సేతుపతి. ఇటీవల వచ్చిన ‘విక్రమ్’ సినిమాలో విజయ్ నటన ఓ లెవెల్ లో ఉంది. సంతానం పాత్రలో విజయ్ సేతుపది జీవించేశాడు.. ఇప్పటికే తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వనున్నాడు మక్కల్ సెల్వన్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ చిత్రంలో విలన్ గా విజయ్ సేతుపతికి అవకాశం వచ్చింది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సౌత్ సినిమాలో తన సత్తా చూపించిన విజయ్.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన విలనిజాన్ని చూపించనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించునున్నారు. విజయ్ సేతుపతి ఉంటే దక్షిణాదిలోనూ మంచి మార్కెట్ వస్తుందని షారుఖ్ భావించారు.

షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతి ఏకంగా రూ.21 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. జవాన్ సినిమా చేసేందుకు అప్పటికే లైన్ లో ఉన్న రెండు సినిమాలను కూడా విజయ్ సేతుపతి వదిలేసుకున్నట్లు సమాచారం. అందుకే జనాన్ నిర్మాతలు అతడికి అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.. సినిమాల్లో క్రేజ్ హీరోలకు మాత్రమే దక్కుతుందని అందరూ భావిస్తారని, కానీ అలాంటిదేం లేదని విజయ్ సేతుపతి నిరూపించారు. విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. జవాన్ సినిమా హిట్ అయితే మాత్రం విజయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జూన్ లో జవాన్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది..

Tags: Bollywood, highlight, Kollywood, latest news, movies, Remuneration, Tollywood, Vijay Sethupathi, viral