నాగ చైతన్య.. నందమూరి అల్లుడు అయ్యేవాడా? అడ్డు చెప్పిందెవరు?

టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు అక్కినేని నాగ చైతన్య మరియు సమంత.. ఇద్దరు ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని.. ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు.. కానీ, ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు.. గతేడాది ఇద్దరు విడాకులు తీసుకున్నారు.. ఈ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులకు షాక్ కి గురిచేసింది. అసలు వారు విడిపోవడానికి కారణం కూడా తెలీదు. ప్రస్తుతం వారిద్దరూ ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. విడాకులు తీసుకుని ఏడాది కావస్తున్నా.. సమంత, నాగచైతన్య ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నాగచైతన్య గురించి ఓ వార్త మీడియా వర్గాల్లో హల్ చల్ చేస్తోంది..

అసలు సమంతను నాగ చైతన్య ప్రేమించకపోయుంటే.. ఎవరిని పెళ్లి చేసుకునే వాడనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.. నాగ చైతన్య తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఇది తెలియక చైతూను ఓ బడా హీరో కూతురికిచ్చి పెళ్లి చేయాలని చూశారు నాగార్జున.. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీలు ఏవంటే గుర్తొచ్చేవి.. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీ విషయం పక్కన పెడితే.. నందమూరి ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మంచి స్నేహితులు. ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవారు.

ఈ స్నేహ బంధం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వచ్చింది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు కచ్చితంగా వెళ్లేవారు. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వీరిద్దరూ అనుకున్నారు. నందమూరి బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని అక్కినేని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు భావించాయి. కానీ నాగచైతన్య మాత్రం సమంతతో లవ్ లో ఉన్నాడు. తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పడంతో నాగార్జున వెనక్కి తగ్గారట.. ఒకవేళ సమంతను నాగచైతన్య ప్రేమించకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు అల్లుడుగా ఉండేవారిని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నాగచైతన్య తన చేతులారా తన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని అనుకుంటున్నారు.

Tags: Bala krishna, Daughter, latest news, Marriage, Naga Chaitanya, Samantha