కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ డైరక్షన్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడిగా అట్లీ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అవడంతో జవాన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటుగా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో నటించేందుకు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు టాక్. జవాన్ సినిమా కోసం విజయ్ సేతుపతి ఏకంగా 21 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని అంటున్నారు. సినిమాలో షారుఖ్ తర్వాత ఈక్వల్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అందుకే అంత భారీ డిమాండ్ చేశారు. ఇక కొన్నాళ్లుగా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న షారుఖ్ ఖాన్ ఈ జవాన్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.
విజయ్ సినిమాలో ఉన్నాడు అంటే ఆ సినిమాకి తమిళంతో పాటుగా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. జవాన్ సినిమా సౌత్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని టాక్. ఆల్రెడీ ఉప్పెనతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) షారుఖ్ తో జవాన్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాకు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఈ సినిమా తెలుగు రైట్స్ కి భారీ డిమాండ్ ఉందని టాక్.