సౌత్ హీరోయిన్ అమలా పాల్ లైంగిక వేధింపులకు గురయ్యారని తెలుస్తుంది. ఆమె మాజీ ప్రియుడు పవీందర్ ఆమెని లైంగికంగా వేధిస్తున్నాడని అంతకుముందు తాము సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలతో తనని బ్లాక్ మెయిన్ చేస్తున్నడని.. తను చెప్పినట్టు వినకపోతే అవి లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది అమలా పాల్.
డైరక్టర్ ఏ.ఎల్ విజయ్ తో పెళ్లికి ముందు పవీందర్ తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించిన Amala Paul అతని నుంచి దూరమై విజయ్ ని పెళ్లాడింది. అయితే అతనితో కూడా రెండేళ్లకే విడాకులు తీసుకుంది. డైవర్స్ తీసుకుని సింగిల్ గా ఉంటున్న అమలా పాల్ కి దగ్గరవుదామని చూస్తున్నాడు పవీందర్. అతను అమలా పాల్ తో ఫోన్ లో వేధిస్తున్నాడట. అతనే కాదు 11 మంది తో కూడా అమలా పాల్ కి కాల్ చేయించి వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది.
యాక్షన్ లోకి దిగిన పోలీసులు పవీందర్ ని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. మిగతా 11 మంది మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ Amala Paul కి ఇలాంటి వేధింపులు అది కూడా తెలిసిన వారి దగ్గర నుంచి వస్తాయని ఎవరు ఊహించ్ ఉండరు.