మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని విలువన స్థలాన్ని అమ్మేశారన్న వార్త కొద్దిరోజులుగా మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నో కోట్ల ఆస్తి ఉన్న చిరంజీవి (Megastar Chiranjeevi) ఆ స్థలాన్ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చ్చింది అన్న కారణాలు కనుక్కోవాలని తెర చూశారు. స్టార్ హీరోగా సినిమాకు పాతిక నుంచి 30 కోట్ల దాకా తీసుకునే చిరంజీవి సిటీలో చాలా చోట్ల మంచి ఏరియాల్లోనే స్థలాలు ఉన్నాయి.
పెద్దగా ఆర్ధిక కారణాలేవి కూడా చిరు స్థలాన్ని అమ్మడానికి కారణాలు కాదని తెలుస్తుంది. ఫిల్మ్ నగర్ లోని చిరు అమ్మేసిన స్థలం ఒకప్పుడు ఆయన 30 లక్షలకు కొన్నారట. అయితే మంచి రేటు రావడంతో ఆ ప్లేస్ ని అమ్మేశారట. 30 లక్షలకి కొన్న చిరు ఆ ప్లేస్ ని ఇప్పుడు 70 కోట్ల దాకా ఆ స్థలాన్ని అమ్మేసినట్టు తెలుస్తుంది.
మంచి రేటు వచ్చిందనే కారణమే తప్ప చిరు ఆ ప్లేస్ అమ్మడానికి పెద్ద రీజన్ ఏమి లేదని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆచార్య డిజాస్టర్ అవడంతో రాబోతున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు చిరు (Megastar Chiranjeevi). గాడ్ ఫాదర్,భోళా శంకర్, వాళ్తేర్ వీరయ్య సినిమాలు లైన్ లో ఉన్నాయి.