విజయసాయిరెడ్డి…అధికార వైసీపీలో నెంబర్-2 స్థానంలో ఉన్న నేత. రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ…కేంద్రంలో లాబీయింగ్ చేస్తుంటారు. ఇక ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ పార్టీ వెనుకుండి నడిపిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడో పార్టీ వెనుకే ఉండటం వల్ల ఏపీ ప్రజలకు ఈయన గురించి పెద్దగా తెలియదు. పైగా ఈయన కూడా ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు కూడా పెద్దగా చేయలేదు.
అయితే ఈయన ప్రజల మధ్యలోకి వెళ్లడం అరుదుగానీ…రోజు ట్విట్టర్ లో ఉండటం మాత్రం అలవాటు. ఇక ఈయన రోజు భోజనం చేస్తాడో లేదో తెలియదుగానీ…ట్విట్టర్ లో టీడీపీ మీద విమర్శలు చేయకుండా ఉండరు. ప్రతిరోజూ ట్విట్టర్ వేదికగా విజయసాయి…చంద్రబాబు లేదా లోకేష్ మీదో ఏదోక ట్వీట్ పెడుతూనే ఉంటారు. అలాగే జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతూ…చంద్రబాబుని తిడుతూ ఉంటారు.
అయితే విజయసాయి ఇలా రోజు టీడీపీని తిట్టడం వల్ల ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా? అంటే అదేం ఉండదు. పోనీ ఈయన ట్వీట్లు జనాలకు రీచ్ అయ్యి టీడీపీ ఏమన్నా నెగిటివ్ అవుతుందా? అంటే అది కష్టమే. అసలు ఈయన పెట్టె ట్వీట్లు వలన సోషల్ మీడియాలో ఉండే వైసీపీ కార్యకర్తలు మానసిక ఆనందం పొందడం తప్ప…వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు.
కాకపోతే విజయసాయి ఏ ట్వీట్ పెట్టిన టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆయనకు వెంటనే కౌంటర్లు వేసేస్తారు. దాని వల్ల అది న్యూస్ అయ్యి విజయసాయి పరువు కాస్తపోతుంది . మొత్తానికి చూసుకుంటే విజయసాయి రెడ్డి ట్వీట్ల వల్ల ప్రజలకు పావలా ఉపయోగం లేదు. ఏదో పనిలేని వాళ్ళు ట్వీట్లు చేస్తే ఎలా ఉంటుందో విజయసాయి చేసిన అలాగే ఉంటుంది.