తేజ ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్‌కు పరిచయమైనా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ తెలుగువారిని తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. మరియు ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ బ్యూటీ. సౌత్ ఇండస్ట్రీలో చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో గౌరవాన్ని అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ శాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు. దీంతో కాజల్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. ప్యారిస్ ప్యారిస్ రిలీజ్‌కు రెడీగా ఉంది.
టాలీవుడ్ నుంచి ఇప్పటికే మహేష్ బాబు – ప్రభాస్ మైనపు బొమ్మలను తయారు చేసిన మేడమ్ టుస్సాడ్స్.. ఇప్పుడు తాజాగా సౌత్ నుంచి మూడో వ్యక్తిగా కాజల్ అగర్వాల్ ఈ మ్యూజియంలో స్థానం దక్కించుకుంది. కాగా, స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలలో నటిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంది.