“లైగర్” ట్రైలర్ రెస్పాన్స్ పై విజయ్ దేవరకొండ ట్విట్!

విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా చిత్రం విడుదల కాకముందే నార్తలోఅతను భారీ స్టార్ డం సంపాదించుకున్నాడు .డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం “లైగర్”, హీరోయిన్గా అనన్య పాండేయ్ నటిస్తుంది , ప్రధాన పాత్రలో రమ్య కృష్ణ కూడా నటిస్తుంది.

విజయ్ దేవరకొండ “లైగర్”సినిమా తో సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా ట్రైలర్‌ను ముంబై మరియు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.హైద్రాబాద్లో ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేయగా ,ముంబైలో రణవీర్ సింగ్ ట్రైలర్‌ను లాంచ్ చేసాడు.

ట్రైలర్ కి వచ్చిన భారీ స్పందన చూసి దానితో పొంగిపోయిన విజయ్ దేవరకొండ “చాలా సార్లు నేను ఆశ్చర్యపోతున్నాను – ఏమి జరుగుతోంది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? వాటిలో ఇది ఒకటి. ముంబై ❤️ మీ ప్రేమ మరియు ఉత్సాహం హత్తుకుంది. మరియు @RanveerOfficial, సోదరా నీకు చాలా ప్రేమ. మీరు ప్రేమతో నిండి ఉన్నారు ❤️ అని ట్విట్ రూపంలో థ్యాంక్స్ చెప్పుతూ ఆశ్చర్యపోయాడు .

Tags: director puri jagannnath, liger movie trailer launch event, liger trailer, ranveer singh, Vijay Devarakonda