యాక్షన్ హీరో అర్జున్ ఇంట విషాదం !

యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న నటుడు అర్జున్ .సౌత్ ఇండియా సినిమాలో తనదైన మార్క్ సినిమాలు చేసి ప్రేక్షకులులకు దగ్గరైడు . ఈ రోజు అర్జున్ ఇంట ఇపుడు ఊహించని విషాదం నెలకొంది. అర్జున్ తల్లి అయిన లక్ష్మీ దేవమ్మ ఆమె వయసుకు సంబంధించిన సమస్యలతో ఈరోజు తన 85వ ఏట కన్ను మూశారు. ఆమె మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉండగా ఈ విషాద ఘటనతో అర్జున్ ఇంట విషాదం నెలకొంది. మరి ఇదిలా ఉండగా రీసెంట్ గానే అర్జున్ దర్శకత్వంతో ఓ సినిమాని స్టార్ట్ చేయగా దానిలో హీరోగా హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు .ఈ సినిమాకి అర్జున్ నిర్మాత.

Tags: actor arjun mother died, hero arjun, sandalwood news, tollywood news