ఆ హిట్ డైరెక్టర్కి ఒకే చెప్పిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా ‘లైగర్’ విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ కావడంతో విజయ్ సైలెంట్ గా ఉన్నాడు. పూరీతో డిస్ట్రిబ్యూటర్ సమస్య కారణంగా ఈ సినిమా ఇంకా వార్తల్లో నిలుస్తోంది.విజయ్, సమంతతో కలిసి ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా ఇప్పటివరకు ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఫిల్మ్నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ప్రకారం పరశురామ్ తో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి అని టాక్.

మరోవైపు బాలకృష్ణ కోసం పరశురామ్ ఒక సినిమా చేయనున్నాడని వార్తల్లో నిలిచాడు. అయితే ఆ సినిమాకి కొత్త సమయం పట్టడంతో విజయ్‌తో సినిమా చేయాలనుకోవడంతో విజయ్‌ కూడా సానుకూలంగా స్పందించారు అని టాక్.విజయ్ దేవరకొండకి ఇంతకు ముందు పరశురామ్’ గీత గోవిందం’ బిగ్గెస్ట్ హిట్ అందించాడు అనే విషయం అందరకి తెలిసిందే .

Tags: director parusuram, telugu news, tollywood news, Vijay Devarakonda