సౌత్ సినిమాల ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరోయిన్

జాన్వీ కపూర్ తన కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. జాన్వీ కు అనేక సినిమాలు లైన్లో ఉన్నాయి కానీ అవన్నీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు.ఎందుకో కానీ జాన్వీకు స్టార్ హీరోల సినిమాలు రావడం లేదు. కియారా అద్వానీ, కృతి సనన్ మరియు ఇప్పుడు రష్మిక వంటి వారు పెద్ద ప్రాజెక్ట్‌లను కైవసం చేసుకోవడం ద్వారా జాన్వీ ను డామినేట్ చేశారు.

గతంలో జాన్వీ కపూర్‌కి చాలా తెలుగు సినిమాలు ఆఫర్ వచ్చాయి, కానీ ఆమె హిందీ ఆఫర్‌లను చూసుకుని తెలుగు ఫిలిమ్స్ వదిలేసింది. ఇప్పుడు జాన్వీ పశ్చాత్తాపం చెందుతోంది. ఇప్పడు తన ప్రతి ఇంటర్వ్యూలో జాన్వీ ఒక తెలుగు సినిమాని కైవసం చేసుకోవాలని అంటుంది.

ఈ సందర్భంలో జాన్వీ పదే పదే ఎన్టీఆర్ పేరును తీసుకుంటోంది,అంతే కాకుండా అతనితో ఎలాగైనా సినిమా చేయాలనుకుంటున్నాను అని అంటుంది .దక్షిణాది చిత్రాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తుంది .మరియు వార్తల్లో ఉండటం ఈ రోజుల్లో అతిపెద్ద పబ్లిసిటీ విజయంగా భావిస్తున్నారు. జాన్వికి తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో చూద్దాం.

Tags: bollywood news, janhvi kapoor, jr ntr janhvi kapoor, tollywood news