బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ చెంఘీజ్ ఖాన్ ‘ సినిమాపై మైండ్ బ్లోయింగ్ న్యూస్‌..!

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే త‌న కెరీర్‌లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్ప‌టికే 107 సినిమాల్లో న‌టించిన బాల‌య్య చేయ‌ని పాత్ర అంటూ ఏదీ లేదు. పౌరాణికం, సాంఘీకం, చారిత్ర‌కం ఇలా చెప్పుకుంటూ పోతే బాల‌య్య చేసిన పాత్ర‌లు ఆ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లోనూ ఎవ్వ‌రూ చేయ‌లేదు. పాత త‌రంలో ఎన్టీఆర్ త‌ర్వాత మ‌ళ్లీ బాల‌య్యే అన్ని పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

29YearsOfAditya369: Balakrishna's unseen working stills from the film |  Telugu Movie News - Times of India

ఇక బాల‌య్య‌కు ఓ డ్రీమ్ రోల్ ఉంది. అదే చెంఘీజ్ ఖాన్‌. ఈ పాత్ర‌లో బాల‌య్య న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో కోరుకోవ‌డం… అయినా అది సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. అస‌లు తెలుగు ప్రేక్షకులకు చెంఘీజ్ ఖాన్ గురించి పెద్దగా తెలియక‌పోవ‌చ్చు. అత‌డు మంగోలులు నాయ‌కుడు. ఓ బందిపోటు దొంగ‌. మ‌నోడు పునాది వేసిన మంగోల్ సామ్రాజ్యం ప్ర‌పంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా నిలిచింది.

ఓ సంచార జాతికి చెందిన వాడు చెంఘీజ్ ఖాన్. షామనిజం మతానికి చెందిన ఈయన ఈశాన్య ఆసియాకు చెందిన ఎన్నో సంచార తెగలకు చెందిన ప్ర‌జ‌ల‌ను ఒక్క‌టి చేశాడు. మామూలుగా ఈ హీరో చ‌రిత్ర తెర‌కెక్కించాలంటే సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఓ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఈ బాధ్య‌త‌ను భుజాన వేసుకుని స్క్రిఫ్ట్ ప‌నులు చేస్తున్నాడ‌ట‌.

Balayya deserves Best supporting actor for UKUP - Balakrishna - NFDB

నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించే క్ర‌మంలోనే బాల‌య్య‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌టే టాక్ ? ఇప్ప‌టికే బాల‌య్య వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌తో దూసుకు పోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి కూడా అప్‌డేట్ రావ‌డంతో అస‌లు బాల‌య్య ఫ్యాన్స్‌ను ఎవ్వ‌రూ ఆప‌లేరు.