నిజ జీవితంలో మామ అల్లుండ్లు అయిన విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం వసూళ్ళ జోరు తగ్గింది. సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంటుంది. అయితే ఆరు రోజులు కలెక్షన్లు చూస్తే సినిమా జోరు తగ్గిందటనే స్పష్టం అవుతుంది. సినిమా వసూళ్ళు మొత్తం పడిపోకున్నా సినిమా వసూళ్లూ మాత్రం రోజు రోజుకు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
అయితే ఇప్పటికే సినిమా హిట్ దిశగా సాగుతున్నప్పటికి వసూళ్ళ జోరు మాత్రం కాస్త నెమ్మదించడం విశేషం. ఈ సినిమాకు ఇప్పటి వరకు కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు కోటీ రూపాయల షేర్‌ను సాధించింది. ఇక ఓవరాల్ గా వెంకిమామ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.27.32కోట్లను సాధించింది. సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో సినిమా వారం రోజులు పాటు థియోటర్లలో ఒకటే రేంజ్‌లో ప్రదర్శించబడుతుంది.
ఇప్పుడు సినిమా ఈ రోజు సాధించిన వసూళ్లను బట్టి తెలుస్తుంది. ఇక ఈ శుక్రవారం మరిన్ని సినిమాలు విడుదల కాబోతున్న తరుణంలో విడుదల అయ్యే సినిమాల ప్రభావం ఏమేరకు ఉంటుందో ఈ సినిమా భవితవ్యం తేలిపోతుంది. వెంకీ మామ ఆరు రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం – 8.65 కోట్లు, సీడెడ్ – 3.74 కోట్లు, గుంటూరు – 1.81 కోట్లు, ఉత్తరాంధ్ర – 3.1 కోట్లు, తూర్పు గోదావరి – 1.75 కోట్లు, పశ్చిమ గోదావరి – 1.11 కోట్లు, కృష్ణా – 1.35 కోట్లు, నెల్లూరు – 0.81 కోట్లు, ఫస్ట్ 6 డేస్ మొత్తం షేర్ – 22.32 కోట్లు, కర్ణాటక రెస్టాప్ ఇండియా – 2.25 కోట్లు, ఓవర్సీస్ – 2.75 కోట్లు, వరల్డ్ వైడ్ 6 రోజుల షేర్ – 27.32 కోట్లు చొప్పున వసూలు చేసింది. మొత్తానికి వెంకిమామ హిట్ దిశగా దూసుకుపోతుంది అని చెప్పవచ్చు.