టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఈ హీరో ఇప్పుడు ఏకంగా ఫోర్భ్స్ జాబితాలో చోటు సంపాదించాడు. ఈ పాన్ ఇండియా హీరోతో పాటుగా మరో టాలీవుడ్ హీరో కూడా ఫోర్భ్స్ జాబితాలో స్థానం సంపాదించడం విశేషం. దేశంలోని అన్ని రంగాల్లో ప్రముఖులను గుర్తించి రేటింగ్ ఇవ్వడంలో ఫోర్భ్స్ ముందుంటుంది. ఈ ఫోర్భ్స్ ఇచ్చే ర్యాంకింగ్‌లు వారి ప్రతిభకు గీటురాయిగా నిలుస్తాయి. అయితే ఈ ఫోర్భ్స్ జాబితాలో చోటు సంపాదించిన ఈ తెలుగు హీరోలు ఎవ్వరు అనుకుంటున్నారు కదా.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్. బాహుబలి సిరీస్ తరువాత తన ఇమేజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. బాహుబలి సినిమా తరువాత సాహో సినిమాతో కూడా తన ఛరీష్మాను అమాంతం ఆకాశానికి పెంచుకున్న తెలుగు హీరోగా నిలిచిపోయాడు. ఈ రెండు సినిమాల పుణ్యమా అని ప్రభాస్‌కు ఫోర్భ్స్ జాబితాలో చోటు దొరికింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబుకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.
ఫోర్భ్స్ ప్రకటించి జాబితాలో ప్రభాస్‌కు 44వ స్థానం దక్కగా, సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు 54వ స్థానం దక్కింది. ఫోర్బ్స్ ప్రభాస్ ఏడాది సంపాదనను కూడా లెక్కేసింది. అందులో ప్రభాస్ ఏడాది సంపాదన రూ.35కోట్లుగా ప్రకటించింది. ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో భారత క్రికెట్ కేప్టేన్ విరాట్ కోహ్లి నిలిచారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 11 స్థానం సంపాదించారు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాత్రం 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బాలీవుడ్ హీరోలు అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్ చోటు దక్కింది. అయితే టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు 77వ స్థానం దక్కగా, బాహుబలిని చెక్కిన జక్కన్న ఉరప్ రాజమౌళికి మాత్రం స్థానం దక్కక పోవడం విడ్డూరమే మరి.