నిజ జీవితంలో ఇద్దరు మామ అల్లుండ్లే.. అదే రీల్ జీవితంలోకి ఎక్కితే ఎలా ఉంటుంది.. రీల్ జీవితంలో కూడా మామా అల్లుండ్లుగా నటిస్తే.. ఆ కిక్కే వేరప్ప అనుకుంటున్నారా.. ఇంతవరకు మామ అల్లుండ్లు నిజ జీవితంలో ఎలా ఉండేవారో తెలియదు కానీ.. రీల్ జీవితంలో నటించలేదు.. జీవించారు అని చెప్పవచ్చు. ఇద్దరు నిజ జీవితాన్ని మరిపించిన మామ అల్లుళ్ళు అనిపించేలా ప్రిమియర్ షో టాక్ వినిపిస్తుంది.. వెంకిమామ సినిమాది. ఈ రోజు ప్రిమియర్ సినిమాలు వేశారు వెంకిమామ సినిమాను.
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య ఇద్దరు కలిసి నటించిన చిత్రం వెంకిమామ. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మించాయి. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వెంకిమామ. ఈ సినిమాను విక్టరీ వెంకటేశ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రిమియర్ షోతో సినిమాల ప్రదర్శనతో వెంకిమామ వేట మొదలైందనే చెప్పవచ్చు. మామ అల్లుండ్లుగా నటించిన వెంకటేశ్, నాగచైతన్య స్క్రీన్‌పై పండించిన హాస్యం, యాక్షన్‌తో పాటు నవరసాలను తమదైన శైలీలో ఇరగదీశారనే టాక్ వినిపిస్తుంది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కించిన ఈసినిమాలో వెంకటేశ్, నాగచైతన్య పోటీ పడి నటించి ప్రేక్షకులను కట్టి పడేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా అటు సంక్రాంతి వస్తే ఆ మజానే వేరుగా ఉండేది అనే టాక్‌ను సొంతం చేసుకుని ముందుకు సాగుతుని వీక్షకుల అభిప్రాయం. ఇద్దరు కామెడితో కడుపుబ్బ నవ్వించారని, దర్శకుడు బాబీ కూడా ఎక్కడ లైన్ మిస్ కాకుండా చిత్రాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్ళారని అంటున్నారు. ఇక వెంకటేశ్ సరసన నటించిన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య సరసన నటించిన రాశీఖన్నాల నటన కూడా బాగుందని టాక్ వినిపించింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది అన్న టాక్‌ను సొంతం చేసుకుంది. సో మొత్తానికి ఈ సినిమా మామ అల్లుండ్ల కేరీర్‌లో అద్భుత చిత్రంగా మిగిలిపోయే ఓ ఆణిముత్యం అనే టాక్ వచ్చింది. ఏదేమైనా సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.