విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన సినిమా వెంకీ మామ. నిజ జీవితంలో మామ అల్లుడు అయిన ఈ ఇద్దరు హీరోలు వెండి తెర మీద కూడా అదే రోల్స్ పోషించారు. జై లవకుశ తర్వాత బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది .
దీనికి తోడు సురేష్‌బాబు భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్లతో వెంకీ మామ మొదటి రోజు సుమారు 7.16 కోట్ల షేర్ ని సాధించింది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రు.36 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే మరో రు.29 కోట్ల షేర్ సాధిస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. వచ్చే వారం రూలర్, ప్రతి రోజు పండగే, దబాంగ్ 3 సినిమాలు ఉన్నాయి. మరి ఈ పోటీ తట్టుకుని ఈ సినిమా ఎంత వరకు కలెక్షన్లు సాధిస్తుందో ? చూడాలి.
‘వెంకీ మామ’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్ వివరాలు:
నైజాం – 2.29 కోట్లు
సీడెడ్ – 1.67 కోట్లు
గుంటూరు – 0.72 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.88 కోట్లు
ఈస్ట్ – 0.66 కోట్లు
వెస్ట్ – 0.35 కోట్లు
కృష్ణా – 0.37 కోట్లు
నెల్లూరు – 0.27 కోట్లు
—————————————-
ఫస్ట్ డే మొత్తం షేర్ – 7.16 కోట్లు
—————————————-