యంగ్ హీరో నితిన్ ఎప్పుడు అభిమానులు అంటే ఎక్కడ లేని అభిమానం చూపుతాడు. అంతేకాదు అభిమానుల కోరికను మన్నిస్తాడు. అయితే ఇప్పుడు అలాంటిదే జరిగింది. అభిమానులు అడిగారని నితిన్ వారి కోసం తన సినిమాపై ఓ అప్‌డేట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో అడిగిన అభిమానుల కోరిక మేరకు తన భీష్మ సినిమా అప్‌డేట్ ఇచ్చేసి వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు నితిన్. అసలే సినిమాలతో బిజిగా ఉన్న నితిన్ ఇప్పుడు అభిమానులు అడిగారని భీష్మ సినిమా పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
నితిన్ నటించిన భీష్మ సినిమా లోని పాటను ఈనెల 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని నితిన్ స్వయంగా వెల్లడించారు. అయితే భీష్మ సినిమాను 2020 ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. గత అక్టోబర్ నెల 27న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు నితిన్. ఇప్పుడు చిత్రంలోని పాటను కూడా యాదృచ్ఛికంగా 27నే విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. మొదటి పాటతో చిత్ర ప్రమోషన్ కూడా ప్రారంభిస్తారేమో చూడాలి మరి.
అయితే భీష్మ సినిమాను ఛలో సినిమా ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో నితిన్‌ను జంటగా రౌడీ హీరోయిన్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇక నితిన్ ఈ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రంగ్ దే తో పాటు సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఏదేమైనా అభిమానుల కోరిక మన్నించి నితిన్ పాటను విడుదల చేయాలనుకోవడం విశేషమే మరి.