ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఏ సినిమా తీసుకున్నా సినిమాల్లో ట్వీస్ట్‌లు ఉంటేనే మజా. ఈ ట్వీస్ట్‌లు ఎంత ఎక్కువగా ఉంటే.. ప్రేక్షకుల్లో అంత టెన్షన్ ఉంటుంది. ఈ ట్వీస్ట్ లు బాగుంటే.. ఇంకా సినిమాలో ఏమీ జరుగుతుందో అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో పెరిగిపోయి సినిమా రక్తి కట్టిస్తుందనేది జగమెరిగిన సత్యం. అయితే సిని దర్శకులు ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో ఈ తరహా ట్వీస్ట్‌లను పెట్టి ప్రేక్షకుల మదిని చూరగొని సినిమాను సక్సెస్ చేసుకోవడం చూస్తున్నాం.
అంతే కాదు ఈ ట్వీస్ట్‌లు ఎక్కువగా ఇంట్రవెల్‌లోనో, ప్రీ క్లైమాక్స్‌లో వస్తుంటాయి. ఈ ట్వీస్ట్ లతో సినిమా ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ దర్శకులు కూడా ఎక్కువగా ట్వీస్ట్‌లను జోడించి సినిమాను విజయవంతం అయ్యోలా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు యాక్షన్, మాస్ సినిమాల్లో ఉండే ట్వీస్ట్‌లను ఫ్యామిలీ సినిమాకు కూడా పాకింది. ఈ ట్వీస్ట్‌ల సంస్కృతిని మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమాలో ప్రవేశపెట్టారు దర్శకుడు మారుతి. ఇప్పుడు ప్రతిరోజూ పండగ క్లైమాక్స్‌లోనూ ఓ అదిరిపోయే ట్విస్టు ఉందట. ఓ తాతయ్య కథ ఇది. మరణానికి దగ్గరగా ఉన్న తాతయ్య చివరి రోజు సరదాలను తీర్చడానికి మనవడు చేసే ప్రయత్నం. చావు కూడా ఓ పండగలా చేసుకోవాలన్న సందేశం పంపుతున్నాడు దర్శకుడు.
ప్రతి రోజు పండుగే సినిమాలో కథలో ఎమోషన్, సెంటిమెంట్, వినోదం ఇవన్నీ సమపాళ్ళలో ఉండేలా చూసుకున్నాడు మారుతి. అయితే వీటన్నింటికి తోడు సినిమాలో ఓ ట్వీస్ట్‌ను జోడించాడని సమాచారం. ఆ ట్వీస్ట్ ఇంటర్‌వెల్‌లోనో, మరే సందర్భంలో కాకుండా ఏకంగా క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్‌ను ప్రవేశపెట్టెలా చూసుకున్నాడు మారుతి. చివరిలో వచ్చే ఈ ట్విస్ట్‌తో కథ స్వరూపమే మారిపోబోతోందని టాక్. ఆ ట్విస్టు ఏమిటన్నది ఇప్పుడే చెప్పకూడదు. థియేటర్లో చూడాల్సిందే. సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 20న వస్తోంది. ఆ రోజున ఈ సినిమాలో ఉండే ట్వీస్ట్ ఏమిటో తేలిపోతుంది. సో వేయిట్ అండ్ సీ.