టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ భార్య నీరజ గురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు. ఆమె భర్త ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆమె పబ్లిక్ లైఫ్ లోకి ఎప్పుడు రారు. ఎప్పుడో బన్నీ పెళ్లికి తన భర్త వెంకటేష్‌తో కలిసి వచ్చి అక్షింతలు వేయడం మాత్రమే చాలా మందికి తెలుసు. అసలు నెట్‌లోనూ, గూగుల్‌లోనూ వెంకటేష్ భార్య నీరజ ఫొటోలు కనిపించడం అరుదు.
ఇక ఆమె నీరజా రెడ్డి అంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒక్కటే వార్తలు పుంకాను పంఖాలుగా వస్తున్నాయి. దీంతో కమ్మ కులానికి చెందిన వెంకటేష్‌ను ఆమె పెళ్లి చేసుకుని దగ్గుబాటి ఇంటి కోడలు అయ్యిందనే చాలా మంది నమ్ముతున్నారు. అసలు ఇది అవాస్తవం. నీరజ స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లి.
ఆమె ఏపీ మాజీ మంత్రి కామినేని హాస్పటల్స్‌కు చెందిన కామినేని శ్రీనివాస్‌కు స్వయానా మేనకోడలు. కామినేని శ్రీనివాస్ స్వస్థలం ఏపీలోని ఇప్పటి ఏలూరు జిల్లా కైకలూరు. ఆయన 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీరజ కైకలూరు వచ్చి మేనమామను గెలిపించాలని ప్రచారం కూడా చేశారు. ఇక నీరజ అక్కది గోదావరి జిల్లాలోని కొవ్వూరు.
కొవ్వూరు ఆంధ్రా షుగర్స్ అధినేత పెండ్యాల అచ్చిబాబు భార్య నీరజకు స్వయానా అక్క. పెండ్యాల అచ్చిబాబు, వెంకటేష్ సొంత తోడళ్లుల్లు కావడం విశేషం. ఈ విషయం తెలియని చాలా మంది నీరజా రెడ్డి అంటూ కట్టు కథలు అల్లేస్తున్నారు. ఇక నీరజ – వెంకటేష్ దంపతులకు ముగ్గురు కుమార్తెల తర్వాత బాబు పుట్టాడు.