నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ – దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా “భగవంత్ కేసరి” . ఈ సినిమా నుంచి ఈరోజు మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడు అయితే టైటిల్ రిలీజ్ చేశారో సోషల్ మీడియాలో శివతాండవం ఆడేస్తోంది.
ఈ సంబరాల్లో ఉండగానే ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కోసం మరో అదిరిపోయే సాలీడ్ అప్‌డేట్ ఇచ్చేశారు. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే కానుకగా ఈ సాలీడ్ ట్రీట్ ఇస్తున్నట్టు కన్‌ఫార్మ్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని క్లీయర్‌గా చెప్పేశారు. అనీల్ అయితే భగవంత్ కేసరి టీజర్‌కు ఇచ్చిన మాగ్నిఫెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసి ఇంకా తాను ఆ ట్రాన్స్‌లోనే ఉన్నానని చెపుతున్నాడు.
ఇప్పటికే బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్లోనే ఉంది. ఈ రెండు సినిమాలకు సాంగ్స్‌తో పాటు ఇచ్చిన నేపథ్య సంగీతం అసలు ఇప్పటకీ జనాల చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇప్పుడు వరుసగా మూడో సినిమాకు థమనే సంగీతం అందిస్తున్నాడు.
ఇక బాలయ్య బర్త్ డే కానుకగా వచ్చే టీజర్ గ్లింప్స్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉంటుందో ? అన్న ఉత్సుకత అందరిలోనూ ఉంది. మొత్తానికి భగవంత్ కేసరి నుంచి అప్పుడే మరో గుడ్ న్యూస్ రావడంతో నందమూరి అభిమానులను ఇక అస్సలు ఆపలేం..!