Mega154 : మెగాస్టార్ సినిమాలో వెంకటేష్.. ఫ్యాన్స్ కి ఇంతకన్నా ఏం కావాలి బాసు..!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి రీమేక్ మూవీ భోళా శంకర్ కాగా.. మరొకటి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో (Mega154) వస్తున్న వాళ్తేర్ వెరయ్య ఒకటి. ఈ రెండు సినిమాలు చాలా క్రేజీగా రానున్నాయి. అయితే వాళ్తేర్ వీరయ్య సినిమాలో మరో సర్ ప్రైజ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటారని టాక్.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించబోతున్నారట. ఈ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో కనిపిస్తారట. ఆయన ఉన్నంత సేపు కామెడీ బాగా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ముందుండే వెంకటేష్ ఈసారి చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కె.ఎస్ రవీంద్ర ఈ కాంబో సీన్స్ ని చాలా క్రేజీగా ప్లాన్ చేస్తున్నారట.

భోళా శంకర్ సినిమా వేదాలం రీమేక్ గా వస్తుండగా Mega154 వాళ్తేర్ వీరయ్య మాత్రం కె.ఎస్ రవీంద్ర కథతో వస్తుంది. ఈ సినిమాలు ఈ రెండు సినిమాలతో చిరు మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాలని చూస్తున్నారు. చిరు సినిమాలో వెంకటేష్ అని వార్త రాగానే అటు మెగా దగ్గుబాటి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Tags: chiranjeevi, KS Ravindra, Megastar Chiranjeevi, Tollywood, Venkatesh