లైగర్ ఫ్లాప్ అయినా తగ్గని విజయ్ పొగరు.. అంత మాట అనేశాడుగా..!

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ చెత్త స్టోరీతో అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద లైగర్ ఊహించని రీతిలో చతికిలబడింది. అయితే ఈ ఫ్లాప్ విజయ్ దేవరకొండను కొంచెం కూడా ప్రభావం చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రౌడీ హీరో శివ నిర్వాణ డైరెక్షన్‌లో తన తదుపరి చిత్రం ఖుషి కోసం సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో సమంతతో కలిసి అతను నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బెంగుళూరులో ఇటీవల జరిగిన సైమా అవార్డులలో విజయ్ దేవరకొండ సూపర్ స్టైలిష్‌గా కనిపించి వావ్ అనిపించాడు. బ్లాక్ సూట్‌లో అతను చాలా అందంగా కనిపించాడు. ఈ అవార్డు ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండకు ‘యూత్ ఐకాన్’ అవార్డు కూడా వచ్చింది.

ఆ మరుసటి రోజు విజయ్ దేవరకొండ ట్విట్టర్‌ వేదికగా సైమా ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటో పోస్ట్ చేసి, “సింగిల్ ప్లేయర్” అని రాశాడు. దాంతో ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏమై ఉంటుందని సినీ ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సింగిల్ ప్లేయర్ అనే ఒక వర్డ్‌ని బట్టి చూస్తే మళ్లీ నిప్పు కణిక వలె తనంతట తానే ఎదగగలనని విజయ్ పరోక్షంగా చెప్పినట్లు స్పష్టమవుతోంది. తనకి ఎవరి మద్దతు అవసరం లేదని, తాను ఒక సింగిల్ ప్లేయర్ అని, మళ్లీ తన సత్తా చాటుతానని తన పొగరుని చూపించాడు విజయ్.

వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తన కాన్ఫిడెన్స్, క్రేజ్‌ను కిందకి లాగవని ఈ హీరో చెప్పకనే చెప్పాడు. అయితే ‘లైగర్’ డిజాస్టర్‌ను రుచి చూశాక కూడా సిల్లీగా కనిపించే ఈ వీరోచిత వ్యాఖ్యలు చేయడం ఎందుకని కొందరు కామెంట్ చేస్తున్నారు. మాటల్లో కాదు సినిమాలతో మీ సత్తా నిరూపించండంటూ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం దేవరకొండ కెరీర్ గ్రాఫ్ ఆల్-టైమ్-లో స్థితిలో ఉండిపోయింది. మరి సమంతతో చేస్తున్న ఖుషి సినిమా ఆయన అతడికి ఒక మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Tags: entertainment News, liger flop, movie news, tollywood cinema, Vijay Deverakonda