వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి వెడ్డింగ్ కార్డుతో ఓ ఐ ఫోన్ కొనేయొచ్చా… అంత కాస్టా…!

చాలా రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి. ఎలా లేద‌న్నా రెండు సంవ‌త్స‌రాలుగా సీక్రెట్‌గా ప్రేమ‌లో ఉన్న ఈ జంట ఎంగేజ్మెంట్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సొట్ట బుగ్గ‌ల సుంద‌రి అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకుంది. ఇక ఈ జంట పెళ్లిపై అధికారిక ఎనౌన్స్‌మెంట్ మెగా ఫ్యామిలీ స‌న్నిహితులు, జ‌న‌సేన ప్ర‌ముఖులు ఇచ్చారు. వారు ఎంగేజ్మెంట్ కార్డును త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయ‌డంతో ఎంగేజ్మెంట్‌పై అధికారికంగా అంద‌రికి క్లారిటీ వ‌చ్చింది. ఇక ఈరోజు ఎంగేజ్మెంట్ పూర్త‌య్యాక త్వ‌ర‌లోనే పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేయ‌నున్నారు.

వీరి పెళ్లి కార్డు ఓ రేంజ్‌లో ఉండ‌బోతోంద‌ట‌. ఒక్కో కార్డు ఖ‌ర్చు రు. 80 వేలుగా ఉండ‌బోతోందంటున్నారు. కార్డుకు బంగారు పూత కోటింగ్‌ను వేయ‌బోతున్నార‌ట‌. కేవ‌లం వెడ్డింగ్ కార్డు కోస‌మే అంత డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నారంటే ఇక పెళ్లి ఏ రేంజ్లో ఎంత అంగ‌రంగ వైభ‌వంగా చేస్తారో ? అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌స్థాన్‌లో నిహారిక పెళ్లి జ‌రిగిన ప్యాలెస్‌లోనే ఈ పెళ్లి కూడా జ‌రుగుతుంద‌ని స‌మాచారం.

ఇక‌వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రు. 8 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. ఇక లావ‌ణ్య కూడా ఒక్కో సినిమాకు రు . కోటి నుంచి కోటిన్న‌ర రేంజ్‌లో డిమాండ్ చేస్తోంది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా లావ‌ణ్య సినిమాల్లో న‌టిస్తుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.