‘ ట‌క్క‌ర్ ‘ రివ్యూ: సిద్ధార్థ్ హిట్ట‌య్యాడా.. మ‌ళ్లీ ఫ‌ట్టేనా…!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో సిద్ధార్థ్‌ ఒకరు. సిద్ధార్థ స్వతహాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన వాడు.. అయినా తమిళంతో సమానంగా తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఒక్క బొమ్మరిల్లు సినిమా తర్వాత తెలుగులో సిద్ధార్థ కు తిరిగిలేని ఫాలోయింగ్ వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో సిద్ధార్థ్ అచ్చ తెలుగు హీరో అయిపోయాడు. ఎంతోమంది తెలుగు యువత సిద్ధార్థ్‌ను అభిమానించేవారు.

Vishal releases first look of Siddharth starrer 'Takkar' | The News Minute

ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాడు. సిద్ధార్థ సినిమాల్లో కంటే ఆయనతో నటించే హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడుపుతూ.. వాడుకుని వదిలేస్తూ ఉంటాడన్న వార్తలతో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాడు.

గత కొంతకాలంగా టాలీవుడ్‌కుదూరంగా ఉన్న‌ సిద్ధార్థ మళ్లీ తెలుగులో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధార్థ నటించిన టక్కర్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ కు జోడిగా దివ్యాంశ కౌశిక్ నటించింది. ఔట్ అండ్ ఔట్‌ లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దు డిఫరెంట్ అవతారంలో కనిపించాడు.

కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో టీజీ విశ్వప్రసాద్ రిలీజ్ చేశారు. తమిళ‌ కమెడియన్ యోగిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సినిమా క‌థ‌లోకి వెళితే డ‌బ్బులు సంపాదించాల‌నే ఓ పేద యువ‌కుడి పాత్ర‌లో సిద్ధార్థ్ న‌టించాడు. ధ‌న‌వంతుడు కావాల‌న్న ఆశ‌తో ఓ యువ‌కుడు త‌ప్పు దారుల్లో వెళ్లి వాటి వ‌ల్ల ఎలాంటి ప‌ర్య‌వ‌స‌నాలు ఎదుర్కొన్నాడ‌న్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో మాఫీయా, యాక్షన్ తో పాటు సిద్దార్ధ్ రొమాన్స్ డోస్ కూడా గట్టిగా ఉంది. అయితే ఇది సిద్ధార్థ్ ఇమేజ్‌కు స‌రితూగే క‌థ కాద‌ని టాక్ ?

సిద్ధు అంటే ఇప్ప‌ట‌కీ బొమ్మ‌రిల్లు లాంటి క్యూట్ లుక్స్ లేదా నువ్వోస్తానంటే నేనోద్దంటానా స్టైల్లో ఫ్యాన్స్ ఊహించుకుంటారు. ఇక సినిమా ఫ‌స్టాఫ్ కాస్త బెట‌ర్‌గా ఉన్నా.. సెకండాఫ్ మాత్రం డిజాస్ట‌ర్‌ను మించి ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సినిమాలో అస‌లు రొమాంటిక్ సీన్స్ ఎందుకు ? పెట్టారో అర్ధం కాలేద‌ని సిద్ధుకు ఈ క‌థ రాంగ్ చాయిస్ అని అంటున్నారు. ఏదేమైనా చాలా రోజుల త‌ర్వాత తెలుగులో ట‌క్క‌ర్ అంటూ వ‌చ్చిన సిద్ధు బోర్లా ప‌డిన‌ట్టుగానే తెలుస్తోంది.