వ‌రుణ్‌తేజ్ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా త‌మిళ కుర్ర హీరో..!

అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా తెలుగుతెర‌కు పరిచయమైన నటుడు నవీన్ చంద్ర త‌న అద్వితీయ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్నాడు. అటు త‌రువాత క‌ల‌ర్స్ స్వాతి తో న‌టించిన హ‌ర్ర‌ర్ చిత్రం త్రిపురలోనూ ఆక‌ట్టుకున్నాడు. అయిన ఎందుక‌నో అవ‌కాశాలు మాత్రం త‌లుపుత‌ట్ట‌లేదు. దీంతో న‌వీన్ త‌న రూటు మార్చుకున్నాడు. ఒక వైపు హీరోగా సినిమాల‌ను చేస్తూనే మ‌రోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న ప్రతినాయకుడి పాత్ర‌ల్లోనూ న‌టిస్తున్నారు. అందులో భాగంగా నాని నటించిన ‘నేను లోకల్ ‘ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాడు. అదేవిధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సామెత వీరరాఘవ’ సినిమాలో ఎన్టీఆర్ కు విల‌న్‌గా క‌రుడుగ‌ట్టిన ఫ్యాక్ష‌నిస్టు తండ్రి జ‌గ‌ప‌తిబాబుకు కొడుకుగా నవీన్ నటించి మంచి మార్కుల‌ను సంపాదించుకున్నాడు. తాజాగా ఒక తమిళ స్టార్ హీరో సినిమాలోనూ విలన్ గా నటించాడు. ప్ర‌స్తుతం మ‌రో రెండు మూడు చిత్రాలు కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా.. న‌వీన్ తెలుగులో మ‌రో భారీ ఆఫర్ ను అందుకున్న‌ట్లు స‌మాచారం. మెగా కుటుంబ వార‌సుడు హీరో వరుణ్ తేజ్ ఇటీవ‌లే గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్నారు. ప్ర‌స్తుం కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో, మాతృ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర‌ల్‌లో తెర‌కెక్క‌నున్న బాక్స‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ కొత్త చిత్రంలో విలన్గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు టాలివుడ్ వ‌ర్గాల టాక్‌. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనుండ‌గా, ప్రతినాయకుడిగా నవీన్ చంద్ర నటిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. సినిమా షూటింగ్ కూడా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. మ‌రి వీరిద్దరిమధ్య పోరాటాలు ఎలా ఉంటాయోన‌ని ప్రేక్ష‌కులు అంచ‌నాలు వేసుకుంటున్నారు.

Tags: boxer movie, Geetha Arts, kiran korrapati, naveen chandra, varun tej