మానవజాతి ఇప్పుడు పొట్టి పొట్టి బట్టల స్టేజ్ దాటి, ఓపెన్ టాప్ అంటూ సరికొత్త రాగాన్ని ఆలపిస్తున్నది. మగవాళ్ల నుంచి ఆ జాడ్యం క్రమేణా ఆడవాళ్లకు కూడా విస్తరిస్తున్నది. మేము సైతం మగాళ్ళతో సమానం, వారిలాగే టాప్ లెస్ గా తిరగితే తప్పేంటి ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఏకంగా టాప్ లెస్ గా తిరుగుతున్నారు. ఇదే నేపథ్యంలో కొన్నేళ్ల క్రితమే అమెరికా న్యూయార్క్‌లో నిపుల్స్ ఫ్రీ అంటూ ఓ ఉద్యమం పురుడు పోసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఒకేరోజున 60నగరాల్లో టాప్ లెస్ గా ప్రదర్శన నిర్వహించడం అప్పట్లో సంచలనంగా మారింఇ. లింగ వివక్షతపై ప్రశ్ననలను సంధించింది. మగాళ్ళు తిరిగితే తప్పు లేనప్పుడు మాపై మాత్రమే ఆంక్షలు ఎందుకు ? మాకు కూడా స్వేఛ్చ కావాలి అంటూ అక్కడి మహిళా లోకం నినదించింది. అందుకు హాలీవుడ్ తార ,మోడల్ అయిన రాచెల్ జెస్సి నాయకత్వం వహించడమేగాక టాప్ లెస్ గా తిరిగితే మెదడుకు స్వేఛ్చ లభిస్తుందని, తద్వారా మంచి ఆలోచనలు వస్తాయని సెలవిచ్చి సంచలనం సృష్టించింది. అదే స్పూర్తితో అటు తరువాత దక్షిణ కొరియాలో కూడా బ్రా ఫ్రీ ఉద్యమం మొదలైంది. గత కొన్నాళ్లుగా ఆ ఉద్యమం సద్దుమణిగింది. ఎక్కడా అలాంటి ప్రదర్శనలు, నిదర్శనలు జరగలేదు. ఇప్పడు తాజాగా మరోసారి నిపుల్స్ ఫ్రీ అంశం తెరపైకి వచ్చింది. ఓ మహిళా ఏకంగా కోర్టునే సవాల్ చేసింది. లింగ వివక్ష ఎందుకని సూటిగా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. అమెరికాలోని ఉతాహ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు రెండేళ్ల కిందట తన భర్తతో కలసి గ్యారేజ్‌లో పనిచేస్తున్నది. అయితే బట్టలకు మరకలు అంటుతాయని భావించి ఆమె భర్త తన షర్ట్‌ను విప్పేశాడు. దీంతో ఆమె కూడా తన టాప్‌ను తొలగించింది. అయితే అక్కడ ఆమె భర్త మొదటి భార్యకు చెందిన ఇద్దరు కొడుకుల ఉన్నారు. ఈ విషయం ఆమె సవితికి తెలియడంతో చిన్నపిల్లల ఎదుటే టాప్ తీసేయడంపై మండిపడింది. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో చైల్డ్‌వెల్ఫేర్ అధికారులు సదరు మహిళలపై కేసు నమోదు చేశారు. తన వక్షోజాలు ప్రదర్శిస్తూ చిన్నారుల ఎదుట అశ్లీలంగా ప్రవర్తించి లైంగిక నేరాలకు పాల్పడిన అభియోగాలను మోపి అరెస్టు చేశారు.
ఈ కేసును బాధిత మహిళ కోర్టులో సవాల్ చేసింది. తన భర్త ఉన్న సమయంలో, ఆయనతో పాటుగానే తన టాప్‌ను తీసేశానని, అది అశ్లీలంగా కనిపిస్తే.. మరి తన భర్త షర్ట్ తీసేయడం అశ్లీలంగా కనిపించడం లేదా? అని వాదనకు దిగారు. తనను అరెస్టు చేసి.. భర్తను అరెస్టు చేయకపోవడాన్ని లింగవివక్షగా అభివర్ణించారు. టాప్‌లెస్‌గా తిరగడం తప్పేమీ కాదని.. అది నేరం కిందకు ఎలా వస్తుందని చెప్పాలని డిమాండ్ చేశారు. టాప్‌లెస్ నిషేధాన్ని రద్దు చేస్తూ కొలరాడో కోర్టు వెలువరించిన తీర్పును ఆమె ఈ సందర్భంగా ఉటంకించారు. అంతేకాదండోయ్ స్త్రీ శరీర భాగాలను అశ్లీలంగా భావించాల్సిన అవసరం లేదని ఆమె తరఫు న్యాయవాది సెలవిచ్చారు. టాప్‌లెస్‌ను తప్పుబట్టడాన్ని లింగవివక్షగా అభివర్ణిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయని వాదించడమేగాక, ఇంతకు అమెరికాలో జరిగిన ఫ్రీ ది నిపుల్ ఉద్యమాన్ని ఉదహరించారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా ఈ ఉద్యమం తెరపైకి వచ్చింది. కోర్టు తీర్పు ఏమి చెబుతుందా? అని అందరూ ఉత్కంఠతగా ఎదురుచూస్తున్నారు.