ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు వైజయంతి మూవీస్ బంగారు కానుక‌

తెలుగు చిత్ర‌సీమ‌లో వైజంయ‌తీ మూవీస్ బ్యాన‌ర్ చ‌రిత్ర ఎన‌లేనిది. సినీ ప్రేక్ష‌కుల‌కు ఎన్నో అపురూప చిత్రాల‌ను అందించి వారి గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు నిర్మాత అశ్వినీద‌త్‌. ఓ సీత క‌థ సినిమాతో మొద‌లైన ఈ సంస్థ ప్ర‌స్థానం 50 వ‌సంతాలుగా అప్ర‌తిహాతంగా కొన‌సాగుతున్న‌ది. ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించింది. బాక్సాఫీసు వ‌ద్ద ఎన్నో రికార్డుల‌ను సృష్టించింది. జ‌గ‌దేగ వీరుడు అతిలోక సుంద‌రి వంటి బ్లాక్ బాస్ట‌ర్ సినిమాల‌ను అందించింది. అక్కినేని, ఎన్టీఆర్ వంటి దిగ్గ‌జ న‌టుల‌తోనే గాకుండా, వారి చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేశ్ న‌టుల‌తోనూ చిత్రాల‌ను తీసింది. అదీగాక నేటి త‌రం కుర్ర హీరోలు రామ‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసింది. ఆ సంస్థ ఇటీవ‌లే గోల్డెన్ జూబ్లీను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న త‌దుపరి చిత్రాన్ని ప్ర‌క‌టించింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బంగారు కానును అందించేందుకు సిద్ధ‌మైంది.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్న‌ది చిత్ర‌బృందం. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా చేయ‌నున్నారు. మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమాను తెరకెక్కించ‌నున్నాడు. కొద్ది రోజులుతో ఈ సినిమా విష‌య‌మై సోష‌ల్స్తుమీడియాలో వార్త‌లు వినిపిస్తున్నా ఎవ‌రూ ఎక్క‌డా స్పందించ‌లేదు. తాజాగా దాన‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేసింద వైజయంతి మూవీస్ బ్యానర్. త‌మ సంస్థ 50 వసంతాల‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ తో సినిమా చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ వార్త‌తో ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజ‌యంతి కాంబినేష‌న్లో సినిమా అనే అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఎలాంటి సినిమా తెరకెక్కించ‌నున్నారోన‌ని అప్పుడే అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఏ క‌థాంశ‌మా అని ఒకింత ఆసక్తి నెలకొంది. పూర్తి వివ‌రాలు తెలియాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే.

Tags: 50 years golden jublee, naag ashwin, Prabhas, vyjayanthi movies