వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ వ‌చ్చేసింది.. పెళ్లి ఎప్పుడు అంటే..!

టాలీవుడ్‌లో గ‌త కొద్ది రోజులుగా వైర‌ల్ అవుతోన్న మెగాహీరో వ‌రుణ్‌తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి సీక్రెట్ ప్రేమ‌కు ఎట్ట‌కేల‌కు త్వ‌ర‌లోనే ఫుల్‌స్టాప్ ప‌డ‌నుంది. గ‌త రెండేళ్లుగా వీరిద్ద‌రి ప్రేమ‌, పెళ్లిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా అప్‌డేట్ ప్ర‌కారం వ‌రుణ్‌, లావ‌ణ్య ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింద‌ట‌. ఇక పెళ్లిపై కూడా క్లారిటీ వ‌చ్చేసింది.

Varun tej Lavanya Tripathi Marriage Archives - Telugu Cinema Today News and Updates

నాగ‌బాబు కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వ‌రుణ్‌తేజ్ టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక వ‌రుణ్ చెల్లి నిహారిక‌, లావ‌ణ్య ముందే మంచి ఫ్రెండ్స్‌. నిహారిక ద్వారానే లావ‌ణ్య‌కు వ‌రుణ్‌కు మ‌ధ్య స్నేహం కుదిరింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి మిస్ట‌ర్‌, అంత‌రిక్షం సినిమాల్లో న‌టించారు. అలా వీరి స్నేహం మ‌రింత స్ట్రాంగ్ అయ్యి వీరు ప్రేమికులు అయ్యారు.

ఇక నిహారిక పెళ్లిలోనూ మొత్తం లావ‌ణ్య హ‌డావిడే క‌నిపించింది. అయితే ఎట్ట‌కేల‌కు వీరి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. జూన్ 9న హైదరాబాద్‌లో బంధుమిత్రులు, కొద్దిమంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో సోష‌ల్ మీడియాలో లావ‌ణ్య – వ‌రుణ్ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Varun Tej And Lavanya Tripathi To Get Engaged On June 9th?, News Viral - Sakshi

ఇక ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయ్యాయ‌ట‌. వ‌ధూవ‌రుల దుస్తులు, ఆభ‌ర‌ణాలను ప్ర‌ముఖ డిజైన‌ర్స్ డిజైన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ వేడ‌క‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజ‌రు కానుంది. ఇక నిహారిక వివాహం జ‌రిగిన‌ప్పుడే మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేదిక మీద‌కు వ‌చ్చింది. ఇప్పుడు వ‌రుణ్ ఎంగేజ్మెంట్‌కు కూడా మళ్లీ మెగా ఫ్యామిలీ క‌లుసుకోనుంది. ఇక ఎంగేజ్మెంట్ త‌ర్వాత ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో పెళ్లి ఉండొచ్చ‌ని టాక్ ?