టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తిగా మారిపోయినట్టే అని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. గత సినిమాలతో పోలిస్తే త్రివిక్రమ్ లో పస తగ్గిపోతోంది. బన్నీతో అల వైకుంఠపురం సినిమా చేసి కూడా రెండున్నర సంవత్సరాలు అయ్యింది. ఈ రెండేళ్లలో ఆయన నుంచి ఒక్క సినిమా రాలేదు.. అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడా ? అన్నది కూడా చాలా మంది సందేహమే అంటున్నారు.
అజ్ఞాతవాసి సినిమాను లేజీగా తీశారు.. డిజాస్టర్ అయ్యింది. అరవింద సమేత హిట్ అయినా అది కూడా త్రివిక్రమ్ రాత, తీత కంటే ఎన్టీఆర్ నటనతోనే సక్సెస్ అయ్యింది. ఇక తాజాగా వచ్చిన గుంటూరు కారం సినిమా టైటిల్ విషయంలో కూడా చాలా చర్చలు, సందేహాలు వినిపిస్తున్నాయి. గత నాలుగు సినిమాలుగా ఫాలో అవుతోన్న అ సెంటిమెంట్ పక్కన పెట్టేశాడు.
గతంలో అతడు, అత్తారింటికి దారేది తర్వాత మధ్యలో సన్నాఫ్ సత్యమూర్తి అన్న టైటిల్ పెట్టాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు సినిమాలకు అ సెంటిమెంట్ ఫాలో అయిపోయాడు. అ..ఆ – అజ్ఙాతవాసి – అరవింద సమేత – అల వైకుంఠపురములో సెంటిమెంట్ ఫాలో అవుతూ ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అమరావతికి అటు ఇటు అన్న టైటిలే పెడతారన్న లీకులు వచ్చాయి.
అయితే చివర్లో గుంటూరు కారం ఫిక్స్ చేశారు. ఇదొక్కటే కాదు.. ఈ గ్లింప్స్ చూస్తుంటే త్రివిక్రమ్ గత సినిమాలకు భిన్నంగా మాస్ పంథాలో వెళ్లినట్టుగా ఉంది. టైటిల్ విషయంలో అ సెంటిమెంట్ మార్చేశాడు. ఇక గ్లింప్స్‌లో కూడా రాత, తీతలో పదును తగ్గినట్టుగానే ఉంది. ఇక గతంలో సినిమా రిలీజ్‌కు ముందే టైటిల్ ఎనౌన్స్ చేసేవారు.
అయితే ఇప్పుడు గట్టిగా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తవ్వకుండానే టైటిల్ కూడా ప్రకటించేశాడు. ఇక తాను డైరెక్ట్ చేసే సినిమా కాకుండా పవన్ సినిమాలపై బాగా ఫోకస్ చేస్తున్నాడన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. మహేష్ సినిమా ఎలా తీస్తున్నాడో ? చూస్తోన్న టాలీవుడ్ జనాలు, స్టార్ డైరెక్టర్లు కూడా త్రివిక్రమ్‌ను నమ్మేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదంటున్నారు.