‘ ఎన్టీఆర్ నేతి పెస‌ర‌ట్టు ‘ వెన‌క ఇంత ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉందా…!

తన నటనతో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్ గా సీనియర్ ఎన్టీఆర్ తిరుగులేని పాపుల‌ర్ హీరో. ఎన్టీఆర్ సినిమాల తర్వాత రాజకీయాలలో కూడా ఎవరు అందుకొని అరుదైన ఘనతను అందుకున్నారు. కేవ‌లం పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

No photo description available.

ఈ క్ర‌మంలోనే ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్‌కు భోజనం అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఆయన రోజు తన అవసరానికి మించి ఆహారం తీసుకున్నా కూడా అదే తరహాలో వ్యాయామాలు చేసి చూసి తన శరీరాన్ని ఎంతో ఫిట్‌గా ఉంచుకునేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా తన ఆహార అలవాటుల‌ను ఎప్పుడు మార్చుకోలేదు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చైతన్య రథంతో ప్రతి ఊరు తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. అదే సమయంలో ఆయ‌న‌ రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలు ఆయన అభిమానులు తండోప తండాలుగా ఆయనను చూసేందుకు వ‌చ్చేవార‌ట‌. అదే సమయంలో ఎన్టీఆర్ ఒక్కొక్కసారి రైల్లో ప్రయాణం చేస్తున్నా ఆయ‌న‌ కోసం అభిమానులు రాత్రి, పగలు తేడా లేకుండా ఆయన కోసం ఎదురు చూసేవారట.

అంతేకాకుండా ప్రతి రైల్వే స్టేషన్లో ఆయనకు ఎంతో ఇష్టమైన నేతి పెసరట్టు పట్టుకుని అభిమానులు ఎదురుచూసే వారట. ఎన్టీఆర్ ఏ రైల్వే స్టేషన్ కు వచ్చిన అందరూ ఆయనకి ఆ నేతి పెసరట్టు తినిపించేవారట. ఎన్టీఆర్ కూడా ప్రతి రైల్వే స్టేషన్లో ఆ నేతి పెసరట్టు తింటూ జ‌ర్నీ చేసేవార‌ట‌. మొదటి నుంచి చివరి వరకు ప్రతి అభిమాని ఇచ్చిన నేతి పెసరట్టును తిన‌డంతో అప్పటి ఆయన తోటి రాజకీయ నాయకులు ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారట. ఈ సంఘటన అప్పటి ప్రజలకు వారి మనసుల్లో గుర్తుండి పోయింది.