వ‌రుణ్ ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌రేగా.. ‘ గాండీవధారి అర్జున ‘ టీజ‌ర్ సూప‌రెహే ( వీడియో)

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటు త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఫుల్ హ్య‌పీగా ఉన్నాడు. తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వ‌ర‌లోనే ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేయ‌డంతో పాటు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌నున్నాడు. ఇక ఇటు సినిమాల ప‌రంగా కూడా
భారీ లైనప్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో గాండీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వ‌రుణ్‌కు జోడీగా అఖిల్ ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య కథానాయిక గా నటిస్తుంది. ముందుగా ప్రకటించినట్లుగా ఈ సినిమా నిర్మాత‌లు ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ ఏజెంట్ గా న‌టించిన‌ట్టు టీజ‌ర్ చూస్తేనే తెలుస్తోంది.

టీజర్ లో నాజర్‌ని ఎందుకు టార్గెట్ చేశారు ? సాక్షి వైద్య వరుణ్ తేజ్‌తో పనిచేయడానికి ఎందుకు నో అని అంటుంది ? లాంటి ప్ర‌శ్న‌లు కాస్త ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇక టీజ‌ర్‌కు మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మంచి హైప్ ఇచ్చాయి. ఈ సినిమాలో వినయ్ రాయ్ విలన్.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 25, 2023న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఏదేమైనా ఈ సినిమాతో వ‌రుణ్ ఖాతాలో మ‌రో అదిరిపోయే యాక్ష‌న్ బ్లాక్‌బస్ట‌ర్ ప‌డుతుంద‌ని టీజ‌ర్ చెప్పేసింది.