వరుణ్ – లావణ్యల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన మెగా ఫ్యామిలీ.. పిక్స్ వైరల్..

మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ గతంలో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. ఆ వార్తలను నిజం చేస్తూ ఇద్ద‌రు ఎంగేజ్మెంట్ చేసుకుని ఫాన్స్ కు సడన్ షాక్ ఇచ్చారు. అయితే వీరిద్దరు నవంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుణ్ – లావణ్య పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వరుణ్ అన్నయ్య నన్ను పెళ్లి పనులు చేయడానికి అమెరికా నుంచి రమ్మన్నాడు అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా వరుణ్ – లావణ్య పెళ్లి సందడి షురూ అయినట్లు చిరంజీవి ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. శుక్రవారం రాత్రి వరుణ్ – లావణ్య ప్రీ వెడ్డింగ్‌ షూట్ జరిగినట్లు తెలుపుతూ ఈవెంట్ కు సంబంధించిన పలు ఫోటోలు షేర్ చేశాడు. ఇందులో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి సందడి చేసిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వరుణ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో.. లావణ్య లెమన్ ఎల్లో చుడిదార్‌లో సాంప్రదాయబద్ధంగా కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ జంట చూడముచ్చటగా ఉన్నారంటూ వీరిద్దరిని చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక లావణ్య తల్లి ఈ పెళ్లికి శ్రీజ, నిహారిక ఇద్దరు రాకూడదంటూ కండిషన్ పెట్టింద‌ట అని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ పిక్స్ తో ఆ పుకార్లకు కూడా చెక్ పెట్టారు మెగా ఫ్యామిలీ.