స్టార్ నటి కాజల్ అగర్వాల్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని దక్కించుకున్నారు. ఇక తాజాగా కాజల్ శ్రీ లీల యాటిట్యూడ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ” భగవంత్ కేసరి ” సినిమాలో వీరిద్దరూ ప్రముఖ పాత్రల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఇక ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న కాజల్ మాట్లాడుతూ..” నేను సినిమాను చాలా ప్రేమిస్తాను. నా ఫస్ట్ ప్రయారిటీ సినిమాకే. అలాగే జీవితంలోనూ ఎదగడం కూడా ముఖ్యమే. ఛాలెంజ్గా తీసుకుంటే ఏదైనా సాధించడం సులభం. ఈ లక్షణాలన్నీ శ్రీ లీల లో చూసా. పక్క ప్లానింగ్ తో కెరీర్లో ముందుకెళ్తుంది. తెలివైన అమ్మాయి. కష్టపడి పనిచేయడంతో పాటు అందరితో ప్రేమగా ఉంటుంది. సెట్లోనూ సరదాగా ఉంటుంది.
నిజంగా ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ తరం నటీ మణులకు ఇలాంటి లక్షణాలే ఉండాలి ” అంటూ తెగ పొగిడేసింది. చివరగా ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ తో ఏ విషయాన్ని దాచలేకపోతున్నామని.. ఏదైనా క్షణాల్లో జనాలకు తెలిసిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం కాజల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.