హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల అందరి సరసన నటించి ఫుల్ బిజీ స్కెడ్యుల్‌ను గడిపిన రకుల్ ఇటీవల టాలీవుడ్ లో పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేక పోతుంది. అయినప్పటికీ బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ ఏడాదికి ఆరు సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ దక్కించుకుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ ప్రయాణం గురించి ఇన్స్టా వేదికగా ఒక స్టోరీ రాసుకొచ్చింది. తను నటిస్తున్న ఓ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
ఒక ప్రమోషన్ లో భాగంగా భూమి పడ్నేకర్ తన సినీ కెరీర్ గురించి ఒక పోస్ట్ పెట్టడంతో పాటు ఆ తర్వాత అనిల్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లను కూడా ట్యాగ్ చేసింది. వారి సినీ ప్రయాణాన్ని తెలియజేయాలంటూ కోరింది. దీంతో రకుల్ తన చిన్న నాటి నుంచే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్నానని.. ఏమీ తెలియని రోజుల్లోనే మోడలింగ్ రంగంలో ప్రవేశించి అక్కడి నుండి మిస్ ఇండియా.. సినిమా జర్నీ స్టార్ట్ అయిందని తెలిపింది. అందరిలానే ఈ ప్రయాణంలో నేను ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాను చాలా తిరస్కరణలను చూశాను అంటూ వివరించింది.
సినిమా ప్రయత్నంలో భాగంగా కుటుంబాన్ని కూడా వదిలేసి ముంబైలో అడుగుపెట్టి ఒంటరిగా జీవించాను.. సినిమాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి క్యూలైన్లో నిలబడి ఆడిషన్స్ లో పాల్గొన్నాను.. కొన్ని సినిమాలకు సైన్ చేసి ఓకే అనేలోపు రాత్రికి రాత్రే తన ప్లేస్ లో వేరే హీరోయిన్స్ ని కూడా తీసుకువచ్చారు. దీంతో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాను అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి వివరించింది. అయితే చివరికి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులు మనసులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తన జీవితం ఈ స్థాయికి రావడానికి కుటుంబం కూడా అండగా నిలిచిందంటూ నోట్‌లో రాసుకొచ్చింది.
View this post on Instagram